సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ రేపు అంటే మే 13న విడుదల కానుంది. ఈ భారీ యాక్షన్ మూవీ రిలీజ్ కు ముందు సల్మాన్ ఒక ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. జీ 5 లో ‘రాధే’ను చూడండి. వినోదంలో పైరసీ చేయవద్దని అని చెప్పారు. పైరసీని అంతం చేస్తామని, ‘రాధే’ను చేయాల్సిన విధంగానే చూస్తామని కమిట్మెంట్ ఇద్దాము ఒక సినిమాను చేయడానికి ఎంతోమంది చాలా కష్టపడతారు. కానీ కొంతమంది సినిమాను పైరసీ ద్వారా చూసి ఎంజాయ్ చేయడం అప్సెట్టింగ్ గా అన్పిస్తుంది అంటూ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు సల్మాన్. ఇక ‘రాధే’లో సల్మాన్ ఖాన్‌తో పాటు రాధే దిషా పటాని, రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్‌లు కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సహకారంతో సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ బ్యానర్ పై సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, రీల్ లైఫ్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. ఈద్ సందర్భంగా మే 13న ఇండియాతో పాటు 40కి పైగా దేశాల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ZEE5లో పే పర్ వ్యూ సర్వీస్ తోపాటు అన్ని ప్రముఖ డీటీహెచ్ ఆపరేటర్ల ద్వారా చూడొచ్చు.