మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “దేవర”..టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు .ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కల్యాణ్ రామ్ ,సుధాకర్ మిక్కిలినేని మరియు కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది .ఈ సినిమాతోనే ఈ భామ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది.అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు.
బిగ్గెస్ట్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న దేవర సినిమాను ఏప్రిల్ 5 న రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావించారు.కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది .అక్టోబర్ 10 న దసరా కానుకగా దేవర సినిమాను రిలీజ్ చేయనున్నారు.దేవర చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ,గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలు భారీగా పెంచేసాయి .ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇదిలా ఉంటే మే 20 న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ కు మేకర్స్ సర్ప్రైజ్ ప్లాన్ చేసారు .ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగల్ రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే దసరా కానుకగా వస్తున్నఎన్టీఆర్ దేవర మూవీకి పోటీగా ఎలాంటి బిగ్ మూవీ విడుదల కావట్లేదు.దీనితో దసరాకు ఎన్టీఆర్ సినిమా భారీగా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.