తన అద్భుత నటనతో తెలుగు, తమిళ భాషల్లో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటి నిత్యా మీనన్. ఇటీవల ఆమె బరువు పెరిగినప్పటికీ, నటనకి బరువుతో సంబంధం లేదని, టాలెంట్ ఉంటే చాలు అని నిరూపిస్తున్న నటి. ధనుష్ సరసన నటించిన తిరు చిత్రంలో ఆమె పెరిగిన బరువుతో కూడిన లుక్‌కి కూడా ప్రేక్షకులు అనుకూలంగా స్పందించారు. అదే సినిమాతో నేషనల్ అవార్డు అందుకోవడం విశేషం.
Also Read : Prithviraj Sukumaran : కేరళవాడినైనా.. నేను భారతీయుడినే..
ఇప్పుడు అదే జోడీ మరోసారి ‘ఇడ్లీ కడాయి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ నిత్యా మీనన్ తన జీవితంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన షేర్ చేసింది. ‘ ఇడ్లీ కడాయి సినిమా షూటింగ్‌లో నాకు చాలా కొత్త అనుభవాలు వచ్చాయి.అక్కడి వాతావరణం, పాత్రల మధ్య బంధం అన్నీ నాకు కొత్తగా, జీవితంలో మర్చిపోలేని అనుభవాలుగా నిలిచిపోతాయి. ఇందులో పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతున్నాను. అయితే ఈ సినిమాలో పిడకలు చేయాల్సిన సీన్ వచ్చింది. డైరెక్టర్ అడిగినప్పుడు వెంటనే ‘చేస్తాను’ అన్నాను. అదే రోజు పేడతో పిడకలు చేశాను. అదేం పెద్ద విషయం కాదనిపించింది. కానీ ఆశ్చర్యంగా నిద్రలేచిన మరుసటి రోజే నాకు తిరు సినిమా కోసం నేషనల్ అవార్డు వచ్చిందని తెలిసింది’ అని ఆనందంగా చెప్పింది నిత్య. అంతే కాదు ఆ అవార్డు వేడుకలో పాల్గొన్నప్పుడు ‘నా చేతి గోళ్లలో ఇంకా పేడ కొంచెం అలాగే ఉంది’ అంటూ నవ్వుతూ గుర్తు చేసింది.