అప్పుడెప్పుడో వచ్చిన ‘భీష్మ’ తరువాత సరైన హిట్ లేక కొన్నాళ్లుగా ఇబ్బంది పడుతున్న హీరో నితిన్, ఇప్పుడు తన దృష్టిని పూర్తిగా కొత్త ప్రాజెక్ట్‌పై కేంద్రీకరించారు. ఈ ఏడాది విడుదలైన ఆయన సినిమాలు ‘రాబిన్ హుడ్’, ‘తమ్ముడు’ ఆశించిన ఫలితాలను ఇవ్వలేక, డిజాస్టర్ రిజల్ట్‌ను అందుకున్నాయి. నితిన్ తన తదుపరి ప్రాజెక్ట్‌గా ‘ఎల్లమ్మ’ అనే సినిమా చేస్తాడని మొదట ప్రచారం జరిగింది. అయితే, ఆ ప్రాజెక్టును పక్కన పెట్టిన నితిన్, ఇప్పుడు దర్శకుడు వీఐ ఆనంద్ చెప్పిన ఒక ఆసక్తికరమైన సైఫై (సైన్స్ ఫిక్షన్) కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Also Read :Toxic: అబ్బే… చెప్పిన డేటుకు కష్టమే
కొంతకాలంగా ఎదురుచూస్తున్న సాలిడ్ హిట్‌ను ఈ సినిమా ద్వారా అందుకోవాలని నితిన్ గట్టి ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో ఆయన డ్యూయల్ రోల్‌లో నటించనున్నట్లు సమాచారం. దర్శకుడు వీఐ ఆనంద్ విషయానికి వస్తే, ఆయన కూడా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి సాలిడ్ హిట్ తరువాత మరో పెద్ద హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. నితిన్‌తో కలిసి చేస్తున్న ఈ సైఫై ప్రాజెక్ట్, ఇద్దరికీ టర్నింగ్ పాయింట్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. నితిన్ అభిమానులు కూడా, రొటీన్ కథలకు భిన్నంగా ఉంటుందని భావిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీని ఎప్పుడెప్పుడు తెరపై చూస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.