David Warner : ఆస్ట్రేలియా క్రికెటర్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇప్పుడు తెలుగునాట ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటున్నాడు. ఆయన తాజాగా తెలుగు సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చేశాడు. నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా వస్తున్న రాబిన్ హుడ్ సినిమాలో ఆయన కీలక పాత్రలో నటిస్తున్నారు. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా ఆయన వచ్చారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముందు వార్నర్ కు నితిన్, శ్రీలీల కలిసి తెలుగు నేర్పిస్తున్న వీడియోను తాజాగా మూవీ టీమ్ విడుదల చేసింది. ఇందులో వార్నర్ కు వీరిద్దరూ కలిసి తెలుగు నేర్పిస్తున్న విధానం నవ్వులు పూయిస్తోంది. ‘వార్నర్ భాయ్.. నువ్వు స్టేజి మీదకు వచ్చిన తర్వాత నితిన్ అంటే నాకు పిచ్చి అని చెప్పాలి’ అంటూ నితిన్ చెప్పాడు. దానికి డేవిడ్ కూడా నాకు నితిన్ అంటే పిచ్చి అంటూ చెప్పుకొస్తాడు.
Read Also : Rishabh Pant: రిషబ్ పంత్ తప్పిదాలు.. లక్నో ఓనర్ ఏమన్నాడంటే?
అటు శ్రీలీల కూడా.. ‘నాకు శ్రీలీల అంటే ఎవరూ నచ్చరు’ అని డేవిడ్ తో పలికించింది. వార్నర్ కూడా అదే ప్రాక్టస్ చేసాడు. ఇలా వీరిద్దరూ తమకు కావాల్సిన వాటిని వార్నర్ నుంచి చెప్పించుకోవడం వీడియోలో కనిపిస్తోంది. అయితే వాటి అర్థాలను కూడా వారు తప్పుగా చెప్తారు. తెలుగు ఆడియెన్స్ అంటే నీకు ఇష్టం అనే అర్థం వస్తుంది అన్నట్టు వార్నర్ కు చెప్పడంతో అతను నమ్మేస్తాడు. ఇలా ఫన్నీగా ఈ వీడియో సాగిపోతుంది. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. వార్నర్ ను బాగా వాడేస్తున్నారంటూ ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. వార్నర్ పాత్ర ఎలా ఉంటుందో అని చాలా మంది సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. వార్నర్ గతంలో చాలా తెలుగు సినిమాల పాటలకు ఫ్యామిలీతో కలిసి డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే.