Nikamma Movie: ఇక్కడే హిట్ కాలే.. అక్కడవుతుందని ఎలాఅనుకున్నారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు లో సక్సెస్ అయిన సినామా కథలు బాలీవుడ్ లో రీమేక్ చేయడం.. దాన్ని సక్సెస్ కొట్టడం.. ఇది చాలా కాలంగా వస్తున్న ఆనవాయితీ.. అందుకే అవి తప్పకుండా సక్సెస్ అవుతాయి. అయితే ఆ సినిమాలపై ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా భారీగానే ప్రమోట్ చేసి మరీ విడుదల చేస్తున్నారు. కానీ ఇటీవల కాలంలో అలాంటి సినిమాలకు అంతగా కలిసి రావడం లేదు. నాని జెర్సీ రీమేక్ ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
జెర్సీ సినిమా చాలా మంచి సినిమా అయినప్పటికీ కూడా కమర్షియల్‌గా మాత్రం తెలుగులోనే అంతగా ఆడలేదు. ఇక హిందీ రీమేక్ కు అయితే కనీసం పెట్టిన పెట్టుబడిలో 10% కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. ఇక ఇప్పుడు నాని చేసిన మరొక రీమేక్ కథ కూడా బాలీవుడ్ దగ్గర బోల్తా కొట్టింది. ఒక విధంగా అవసరం లేని రీమేక్ చేసి అనవసరంగా డబ్బులు పోగొట్టుకుని పరిస్థితి ఏర్పడిందనే చెప్పవచ్చు. ప్రముఖ దర్శక నిర్మాత అహ్మద్ ఖాన్ తెరపైకి తీసుకువచ్చిన ‘నికమ్మ’ MCA కు రీమేక్ గా తెరకెక్కింది. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుంది అని చిత్ర యూనిట్ సభ్యులు ఎంతగానో ప్రమోట్ చేశారు. అభిమన్యు దాసాని కథానాయకుడిగా ‘ షెర్లీ సెటియా హీరోయిన్ గా చేయగా తెలుగులో భూమిక చేసిన క్యారెక్టర్ని శిల్పా శెట్టి చేశారు.
Also Read
ఈ శుక్రవారం గ్రాండ్ గానే రిలీజ్ చేయగా ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకుంది. మొదటిరోజు ఈ సినిమాకు కేవలం 25 లక్షలు కలెక్షన్స్ రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలు నాని ఎంసీఏ సినిమా వీళ్ళు ఎందుకు రీమేక్ చేశారు అనేది పెద్ద డౌట్. ఎంసీఏ సినిమా తెలుగులోనే పెద్ద గా చెప్పుకునెంత సక్సెస్ ఏమీ కాలేదు. పక్కా కమర్షియల్ రొటీన్ ఫార్మాట్ లోనే ఆ సినిమాను తెరపైకి తీసుకువచ్చారు. కేవలం నాని సాయి పల్లవి వరుస విజయాలు నుంచి వచ్చిన క్రేజ్ ద్వారానే ఆ సినిమా అలా ఆడేసింది.
అయితే అలాంటి సినిమాను హిందీలో ఎందుకు రీమేక్ చేశారు అనేది పెద్ద మిస్టరీ అనే చెప్పాలి. సక్సెసైన కథలే అంతంతమాత్రంగా ఆడుతుంటే ఇక ఏదో యావరేజ్ గా ఆడిన ఎంసీఏ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో స్పెషల్‌గా చెప్పనవసరం లేదు. ఈ సినిమా రిజల్ట్ నేను తెలుగు వాళ్ళు ముందే ఊహించారు. కానీ అనవసరంగా దర్శకనిర్మాత గుడ్డిగా నమ్మి డబ్బు టైమ్ రెండు వేస్ట్ చేసుకోవాల్సి వచ్చింది.
Reactor Blast: వెలిమినేడులో పేలిన రియాక్టర్.. భారీగా వెలువడిన విషవాయువులు
- Tags
- Bhumika
- MCA
- Nani
- nikamma
- Sai Pallavi
తాజావార్తలు
-
Mokshagna : నందమూరి మోక్షజ్ఞకు యాక్టింగ్ ఇంట్రస్ట్ లేదా?
-
Hyderabad: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ వన్‌వే ట్రయల్ రన్.. వాహనదారులకు కీలక సూచనలు.!
-
Honda SP 125 vs TVS Raider 125: మైలేజీలో హోండా, ఫీచర్లలో టీవీఎస్.. 125cc సెగ్మెంట్లో ఈ రెండు బైక్‌లలో నంబర్ 1 ఏది?
-
Samantha : టాలీవుడ్ లేడి సూపర్ స్టార్ అంటే సమంత మాత్రమే.. కారణం ఏంటంటే?
-
Bollywood Updates : రెండేళ్ల పాటు మీడియాకు దూరంగా… స్టార్ హీరో షాకింగ్ డెసిషన్
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!