టాలీవుడ్ ఇప్పుడు ప్రపంచ స్థాయి సినిమా పరిశ్రమగా ఎదిగిన విషయం అందరికీ తెలిసిందే. టాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇలాంటి సమయంలో టాలీవుడ్‌లో కొత్తగా ఓ నిర్మాణ సంస్థ పుట్టబోతోంది. ‘సోమో ఐరానిక్ ఆర్ట్ క్రియేషన్స్’ పేరుతో ఈ కొత్త ప్రొడక్షన్ హౌస్ ఆవిర్భవిస్తోంది. గురువారం నాడు ఈ బ్యానర్ లోగోను ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం ‘సోమో ఐరానిక్ ఆర్ట్ క్రియేషన్స్’ అధినేత జేజే మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను పంచుకున్నారు.
Also Read:PM Modi: మమత సర్కార్‌పై మోడీ తీవ్ర విమర్శలు.. ‘నిర్మంత’ అంటూ వ్యాఖ్య
‘టాలీవుడ్‌లో నిర్మాతగా అడుగుపెట్టడం ఎంతో సంతోషంగా ఉంది. మా లాంటి కొత్తవారిని టాలీవుడ్ హృదయపూర్వకంగా స్వాగతిస్తోంది. ఈ పరిశ్రమలోని సీనియర్లు మాకు ఎంతో సలహాలు, మార్గదర్శనం అందించారు. మా సంస్థను ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేశాము, మరియు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి కూడా మాకు పూర్తి సహకారం లభించింది. ఈ రోజు మా సంస్థ లోగోను ఆవిష్కరించడం గర్వంగా ఉంది. మా లోగోలో చూపినట్లుగా, సినిమా కళ ద్వారా వెలుగును ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేయాలని మా ఆకాంక్ష. పరిశ్రమలో పరస్పర సహకారం, కొత్త ఆలోచనల ఎదుగుదల అనే భావనతో మా లోగోను రూపొందించాము. కొత్త ప్రతిభలను ప్రోత్సహించడం, సరికొత్త కథలను తెరపైకి తీసుకువచ్చేందుకు మేము కృషి చేస్తాము. ‘సోమో ఐరానిక్ ఆర్ట్ క్రియేషన్స్’ బ్యానర్‌పై త్వరలో ఓ భారీ చిత్రం ప్రారంభం కానుంది. రానున్న రోజుల్లో ఎన్నో నాణ్యమైన, ఆకర్షణీయమైన సినిమాలను నిర్మించాలని మా సంకల్పం’ అని ఆయన తెలిపారు.