ఇండియా మారుతోంది. ఇండియన్ ఎంర్టైన్మెంట్ ఇండస్ట్రీ కూడా మారుతోంది. థియేటర్లు ఖాళీగా కనిపిస్తుంటే… ఓటీటీల్లో ఆన్ లైన్ రద్దీ పెరుగుతోంది. అందుకు తగ్గట్టే నెట్ ఫ్లిక్స్ లాంటి దిగ్గజాలు వినోదాన్ని మరోక్క అడుగు ముందుకు తీసుకెళ్లే పనిలో నిరంతరం ఉంటున్నాయి. ఇక ఇప్పుడు స్ట్రీమింగ్ జెయింట్ కన్ను డేటింగ్ రియాల్టీ సిరీస్ పై పడింది…
ఇండియాలో ఇంత కాలం పెళ్లిల్లు కుదిర్చే టీవీ షోలు, పెళ్లైన ఆలుమగల పంచాయితీలు తీర్చే కార్యక్రమాలు మనం చూశాం. కానీ, నెట్ ఫ్లిక్స్ త్వరలో డేటింగ్ ను కూడా ఇంటింటికి తీసుకొచ్చేయబోతోంది. ‘ఐఆర్ఎల్ : ఇన్ రియల్ లవ్’ పేరుతో ఒక రియాల్టీ షో ప్లాన్ చేస్తున్నారు. అందులో డేటింగ్ చేయాలనుకునే వారికి ‘సరైన జోడీ’ని వెదికి పెడతారట. ఉత్సాహం ఉన్న వాళ్లు షోకి వచ్చేందుకు సిద్ధం కండీ అని కూడా ఆహ్వానం పలుకుతున్నారు! వెళ్లే వాళ్లు ఎందరుంటారో కానీ… నెట్ ఫ్లిక్స్ డేటింగ్ షో మాత్రం చాలా మందే చూసే ఛాన్స్ ఉంది. ఓటీటీ కంటెంట్ తెగ చూస్తోన్న ప్రస్తుత జనరేషన్ డేటింగ్ చుట్టూ సాగే రియాల్టీ షో అంటే కళ్లప్పగించేయటం దాదాపుగా ఖాయమే!
Read Also : వ్యాక్సిన్ ఉద్యమంలో… అనీల్ కపూర్, కత్రీనా కైఫ్, ఏఆర్ రెహ్మాన్…
పెళ్లి, ప్రేమ లాంటి పదాలు ఇంత కాలం ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని శాసించాయి. అందుకు తగ్గట్టే, లవ్ స్టోరీలతో సినిమాలు తీయటం మొదలు… కొందరు సెలబ్రిటీల టెలివిజన్ స్వయంవరాల దాకా… హంగామా నడిచింది. నెట్ ఫ్లిక్స్ తొలిసారి డేటింగ్ ను అధికారికంగా ప్రమోట్ చేయబోతోంది. ఇండియన్ నెటిజన్స్ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి మరి…