టాప్ హీరోల సినిమాలపై ఆడియన్స్ అటెన్షన్ మరింత గ్రాబ్ చేసేందుకు పలు ఎక్స్ పరిమెంట్స్ చేస్తుంటారు డైరెక్టర్స్. అందులో ఒకటి స్టార్ హీరోలతో క్యామియో అప్పీరియన్స్ ఇప్పిచడం. ఇలాంటి ట్రెండ్ ఎప్పటి నుండో ఉంది కానీ.. తలైవా రజనీకాంత్ మూవీల్లో ఇటీవల ఎక్కువైంది. జైలర్, వెట్టయాన్, రీసెంట్ కూలీ వరకు తలైవాకు స్టార్ హీరోలు అదీ కూడా మల్టీ ఇండస్ట్రీ హీరోలు జోడయ్యారు. జైలర్‌లో మలయాళ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జాక్రీషాఫ్ క్యామియో రూపంలో అలరించారు. వీళ్లకు సరైన సీన్లు పడటంతో సినిమాకు ప్లస్ అయ్యింది. నెల్సన్ దిలీప్ కుమార్‌కు నెగిటివ్ మార్క్ అంటలేదు.
Also Read : NTR 31 : ఎన్టీఆర్ – నీల్ ‘డ్రాగన్’ ఒకటి కాదు.. టు పార్ట్స్ గా వస్తున్నాడు
తలైవా నెక్ట్స్ సినిమా వెట్టయాన్ కు ఇదే ఫార్ములా వర్కౌట్ చేస్తే బెడిసికొట్టింది. అమితాబ్, ఫహాద్ ఫజిల్ లాంటి హీరోలకు మంచి రోల్స్ పడ్డా కథలో పసలేకపోవడం మైనస్ అయ్యింది. నెల్సన్ ను చూసి వాతపెట్టుకున్న లోకేశ్ కనగరాజ్ పలు ఇండస్ట్రీల నుండి సీనియర్ హీరోలను రజనీ కోసం పట్టుకొచ్చాడు. టాలీవుడ్ నుండి నాగార్జున, కన్నడ నుండి ఉపేంద్ర, మలయాళం నుండి సత్యరాజ్, బాలీవుడ్ నుండి అమీర్ ఖాన్ తెచ్చి ఎవ్వరినీ సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయాడు లోకీ. సినిమా రూ. 500 కోట్లు అయితే కొల్లగొట్టింది కానీ కోలీవుడ్ ప్రేక్షకులను శాటిస్పై చేయలేకపోయింది. వెట్టయాన్, కూలీ రిజల్ట్స్ చూసి కూడా సేమ్ వంటకాన్ని వండుతున్నాడు నెల్సన్ దిలీప్ కుమార్. జైలర్‌కు వర్కౌట్ అయిన మల్టీ స్టార్స్ అప్పీరియన్స్ ఇందులోనూ వర్కౌట్ చేస్తున్నాడు. జైలర్‌లో నటించిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కంటిన్యూ అవుతుండగా జైలర్2లో ఫహద్ , మిధున్ చక్రవర్తి, ఫహాద్ ఫజిల్, విద్యాబాలన్, సూరజ్ వెంజరమూడు లాంటి స్టార్లను యాడ్ చేస్తున్నాడు. ఇంతమంది స్టార్స్ ని యాడ్ చేస్తున్నాడు కానీ కథలో విషయం లేకుంటే ఎంత మందిని యాడ్ చేసిన నో యూజ్.
