యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం ‘డ్రాగన్’. కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చాలా నెలల క్రితం ఈ సినీమాను గ్రాండ్ గా స్టార్ట్ చేసాడు నీల్. హైదరాబాద్, కర్ణాటకలో కొంత మేర షూట్ కూడా చేసారు. ఎన్టీఆర్ కెరీర్ లో 31వ సినిమాగా వస్తోంది డ్రాగన్.
Also Read : Ranbir Kapoor : ‘యానిమల్’ బ్లాక్ బస్టర్ తర్వాత కనిపించని రణబీర్.. ఎందుకు ఈ గ్యాప్
కాగా ఈ సినిమా ఆగిపోయిందని, హీరోకు దర్శకునికి మధ్య చెడిందని, ప్రశాంత్ తీసిన అవుట్ ఫుట్ పట్ల ఎన్టీఆర్ సంతృప్తిగా లేడని అందుకే స్క్రాప్ చేసారని, అలాగే కథలో మార్పులు చేర్పులు చేయమని కూడా ఎన్టీఆర్ సూచించారని, ఈ విషయంలో ఎన్టీఆర్ కు దర్శకుడు ప్రశాంత్ నీల్ కు మధ్య మనస్పర్థలు వచ్చినట్టు వార్తలు వెలువడ్డాయి. కానీ అవన్నీ వట్టి పుకార్లు మాత్రమే. ఎవరు ఊహించని విధంగా డ్రాగన్ ను ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ముందు అనుకున్న కథకు కాస్త మార్పులు చేసి ఎన్టీఆర్ ను సరికొత్తగా చూపించబోతున్నాడట. అలాగే ఈ సినిమాను రెండు భాగాలుగా తెరెకెక్కించబోతున్నాడు నీల్. అయితే సలార్ లాగా రెండు వేరు వేరు సినిమాలలాగా కాకుండా రెండు పార్ట్శ్ ను ఒకేసారి షూట్ చేసి ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసిన నెలకు సెకండ్ పార్ట్ ను రిలీజ్ చేసేలా ప్లానింగ్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఫస్ట్ అనుకున్న కథ నిడివి 3 గంటల 40 నిముషాల వరకు వస్తుండడంతో రెండు పార్ట్స్ చెయ్యాలని హీరో, డైరెక్టర్ నిర్ణయం చేసారు. ఆ ప్రకారం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఆగిందనుకున్న సినిమా భారీ ప్లానింగ్ తో రాబోతుంది.