NTV Telugu Site icon

NBGM : టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మాస్ కాంబినేషన్ లో మరో సినిమా రానుందా..?

Untitled Design (17)

Untitled Design (17)

టాలీవుడ్ లో కొన్ని కొన్ని కాంబోలకు ఉండే క్రేజ్ వేరు. రాజమౌళి ఎన్టీయార్, మహేశ్ పూరి, పవన్ హరీష్, బాలయ్య బోయాపాటి వీరి కలయికలో సినిమా అనగానే ఫ్యాన్స్ కు వచ్చే కిక్ వేరే. అటువంటి బ్లాక్ బస్టర్ కంబినేషన్ మరోసారి జోడి కట్టబోతుంది. అదే బాలయ్య గోపిచాంద్ కాంబో. గతంలో గోపీచంద్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా చేసిన వీరసింహ రెడ్డి సూపర్ హిట్ గా నిలిచింది. బాలయ్యను పంచె కట్టులో, రాయల సీమ యాసలో చూపించిన విధానానికి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ రాబట్టింది.

Also Read : AartiRavi : విడాకులపై షాకింగ్ కామెంట్స్ చేసిన జయం రవి భార్య ‘ఆర్తిరవి’

తాజాగా మరోసారి వీరిద్దరు చేతులు కలాపబోతున్నట్టు టాలీవుడ్ సర్కిల్స్ లో గట్టిగా వినపడుతోంది. వీరసింహారెడ్డి సినిమా నిర్మించిన టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సంస్థ ఈ సినిమాకు శ్రీకారం చుట్టనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల చర్చలు జరిగాయని, దర్శకుడు గోపిచంద్ మలినేని ప్రస్తుతం బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
అందు నిమిత్తమై ముంబై వెళ్ళాడు గోపీచంద్. ముంబై నుండి తిరిగి వచ్చాక మరోసారి చర్చలు ఉంటాయని టాక్. గోపీచంద్ బాలీవుడ్ డెబ్యూ సన్నీ డియోల్ సినిమా ముగిసిన వెంటనే బాలయ్య సినిమాకు సంబంధించి కథ, కథనాలపై ద్రుష్టి పెడతారని చర్చించుకుంటున్నారు. ఈ సినిమా మెటీరిలైజ్ అయితే బాలయ్య ఫ్యాన్స్ కు పండగ అనే చెప్పాలి. మరోపక్క బాలయ్య, బాబీ దర్శకత్వంలోని సినిమాలో నటిస్తున్నాడు.చివరి దశ షూటింగ్ లో ఉన్న ఈ సినిమా డిసెంబరు లేదా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

Show comments