AartiRavi : విడాకులపై షాకింగ్ కామెంట్స్ చేసిన జయం రవి భార్య ‘ఆర్తిరవి’
- విడిపోయిన నటుడు జయం రవి - ఆర్తిరవి
- విడిపోతున్నట్టు లేఖ విడుదల చేసిన జయం రవి
- బదులుగా మరొక లేఖ విడుదల చేసిన ఆర్తి రవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ట్ హీరో జయం రవి, సతీమణి ఆర్తితో విడాకులు తీసుకున్నట్టు ప్రకటించారు. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. ఇటీవల వీరివురి మధ్య మనస్పర్థలు రావడంతో వేరువేరుగా ఉంటున్నారు. కాగా రెండు రోజుల క్రితం తాము వీడిపోతున్నట్టు లేఖ విడుదల చేసాడు జయం రవి. ఈ నేపథ్యంలో ఈ రోజు జయం రవి వ్యాఖ్యలకు బదులుగా ఆయన భార్య ‘ఆర్తి రవి’ సంచలన లేఖ విడుదల చేసారు.
Also Read: VJS – Trisha : బ్లాక్ బస్టర్ సినిమాకు పార్ట్ – 2 రాబోతుంది.. షూటింగ్ ఎప్పుడంటే..?
Also Read
ఆ లేఖలో ఆర్తి ” నాకు తెలియకుండా, అనుమతి లేకుండా మేము విడిపోతునట్టు జయం రవి బహిరంగ ప్రకటన చేయడంతో నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. 18 సంవత్సరాల భాగస్వామ్య జీవితం తర్వాత, అటువంటి ముఖ్యమైన విషయాన్ని నాకు చెప్పకుండా విడిపోతున్నట్టు ప్రకటించడం నన్ను ఎంతగానో బాధించింది.కొంత కాలంగా నా భర్తతో నేరుగా మాట్లాడటానికి అనేక సార్లు ప్రయత్నించాను. దురదృష్టవశాత్తూ, ఆ అవకాశం నాకు లభించలేదు, ఈ ప్రకటనతో నా పిల్లలు మరియు నేను షాక్ లో ఉన్నాం. మా వివాహం రద్దు చేసుకుని విడిపోవాలనే నిర్ణయం పూర్తిగాఏక పక్షంగా జరిగింది. ఇది మా కుటుంబానికి ప్రయోజనం కలిగించదు. ఈ సంఘటన మాకు ఎంతో భాద కలిగించినప్పటికీ, నేను గౌరవప్రదంగా ఉండాలని భావిస్తున్నాను. అందుకే ఇప్పటి వరకు పబ్లిక్ గా ఈ విషయం గురించి మాట్లాడలేదు.
అన్యాయంగా నాపై నిందలు వేసి, నన్నుక్యారక్టర్ ను తప్పుగా చూపిస్తూ వస్తున్నవార్తలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయి. ఒక తల్లిగా, నా మొదటి ప్రాధాన్యత మరియు ఎల్లప్పుడూ నా పిల్లల శ్రేయస్సు. ఈ సంఘటన నా పిల్లల జీవితంపై ప్రభావితం చేస్తుందేమో అనే భయం నాలో ఉంది. నా దృష్టి మా పిల్లల శ్రేయస్సుపైనే ఉంటుంది ఈ క్లిష్ట సమయంలో వాళ్ళని నేను కాపాడుకుంటాను. కాలక్రమేణా నిజాలేంటో అందరికి తెలుస్తాయని నేను భావిస్తున్నఇన్నాళ్లు మద్దతునిచ్చిన ప్రెస్, మీడియా మరియు మా ప్రియమైన అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ దయ మరియు ప్రేమ మాకు బలం. మా జీవితంలోని ఈ అధ్యాయంలో మీరు మా పట్ల గోప్యత వ్యవహరించడాన్ని నేను అభినందిస్తున్నాను” అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
-
Story Board: ఇప్పుడు ధనుష్.. నిన్న విజయ్.. సినిమా వాళ్లు లేకుండా తమిళ రాజకీయం నడవదా..?
-
Vishwak Sen: ‘కల్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్.. ఎందుకో చెప్పిన విశ్వక్సేన్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!