ఓటీటీలోనే నయనతార ‘నెట్రికన్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తాజా చిత్రం ‘నెట్రికన్’ థియేటర్లలో కాకుండా ఓటీటీ ద్వారానే విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ విడుదల చేసింది. 2011 కొరియన్ మూవీ ‘బ్లైండ్’ స్పూర్తితో ‘నెట్రికన్’ తెరకెక్కుతున్నట్టు కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాతో ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ నిర్మాతగా మారుతుండటం విశేషం.
Read Also : జిమ్ లో దూరిన ‘పులి’! భారీ వ్యాయామాలు చేస్తోన్న ‘టైగర్’…
Also Read
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
‘అవల్’ ఫేమ్ మిలింద్ రావ్ దర్శకత్వంలో నయనతార నాయికగా విఘ్నేష్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేశాడు. అజ్మల్ అమీర్, ఇందుజ, మణికందన్, శరణ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘నెట్రికన్’లో నయన్ కళ్ళు కోల్పోయిన యువతి పాత్రలో కనిపించబోతోంది. పోలీస్ అకాడమీలో శిక్షణ పొందిన ఆమె, ఓ కారు ప్రమాదంలో కంటి చూపును కోల్పోతుంది. తన దుస్థితికి కారణమైన వ్యక్తులను నయన్ ఎలా ట్రేస్ చేసిందన్నదే ఈ చిత్రకథ. ‘మెరీనా’ ఫేమ్ గిరీష్ సంగీతం అందించిన ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అయ్యేది మాత్రం ఇంకా ప్రకటించలేదు.
తాజావార్తలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!