జిమ్ లో దూరిన ‘పులి’! భారీ వ్యాయామాలు చేస్తోన్న ‘టైగర్’…

యాభై దాటి అరవైకొచ్చేస్తోన్న వయస్సులో యాక్షన్ సినిమాలు చేయటం మామూలు విషయం కాదు. కానీ, సల్మాన్ ఖాన్ దాన్నే ఛాలెంజ్ గా తీసుకున్నాడు. ‘టైగర్ 3’ స్పై థ్రిల్లర్ తో రాబోతోన్న కండల వీరుడు ఫ్యాన్స్ కి సూపర్ ‘కిక్’ ఇవ్వబోతున్నాడు. అందుకోసం జిమ్ లో బోలెడు చెమటలు చిందిస్తున్నాడు!

Read Also : తల్లి పుట్టినరోజు… సోనూసూద్ ఎమోషనల్ పోస్ట్

బీ-టౌన్ సీనియర్ హీరో సల్మాన్ మరోసారి టైగర్ క్యారెక్టర్ లో రా ఏజెంట్ గా నటిస్తోన్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ముంబైలో ఈ సీక్వెల్ మూవీ షూటింగ్ జరుగుతోంది. దాని కోసమే ఎప్పటికంటే మరింత ఎక్కువగా భాయ్ జాన్ కండలు ఇరగదీస్తున్నాడట. జిమ్ లో చేస్తోన్న వర్కవుట్ వీడియో స్వయంగా సల్మానే ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ‘ఈయన టైగర్ 3 కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నాడనుకుంటా’ అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు!

సల్మాన్ మాత్రమే కాదు ‘టైగర్ 3’లో విలన్ గా నటిస్తోన్న ఇమ్రాన్ హష్మి కూడా జిమ్ లో చెమటలు చిందిస్తున్నాడు. ఆయన షర్ట్ లెస్ పిక్ ఒకటి రీసెంట్ గా వైరల్ అయింది. మొత్తంగా చూస్తే… ‘టైగర్ 3’లో ఇటు హీరో, అటు విలన్ ఇద్దరూ కండలు చూపించి కలకలం సృష్టించేలా ఉన్నారు! అఫ్ కోర్స్, గార్జియస్ గాడెస్ కత్రీనా కూడా కేవలం రొమాన్స్ మాత్రమే కాక ‘టైగర్’ మూవీస్ లో యాక్షన్ కూడా ఇరగదీస్తుందని మనకు తెలిసిందేగా! లెట్స్ వెయిట్ ఫర్ ద థ్రిల్…

https://www.instagram.com/p/CRjqfvtlIlh/?utm_source=ig_embed&utm_campaign=loading

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-