సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తాజా చిత్రం ‘నెట్రికన్’ థియేటర్లలో కాకుండా ఓటీటీ ద్వారానే విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ విడుదల చేసింది. 2011 కొరియన్ మూవీ ‘బ్లైండ్’ స్పూర్తితో ‘నెట్రికన్’ తెరకెక్కుతున్నట్టు కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాతో ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ నిర్మాతగా మారుతుండటం విశేషం. Read Also : జిమ్ లో దూరిన ‘పులి’! భారీ వ్యాయామాలు…