రెమ్యునరేషన్ ఇంకో కోటి ఎక్కువ ఇస్తామన్నా నయనతార ప్రమోషన్స్‌కు వచ్చే ప్రసక్తే లేదంటుంది. అసలు సైన్ చేసే ముందే సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రమోషన్స్‌కు రానని, అలాగైతేనే నటిస్తానని ముందే చెప్పేస్తుంది. అందుకు ఓకే అంటేనే అగ్రిమెంట్ మీద సైన్ చేస్తుంది. ముందునుంచీ ఇదే పద్ధతిలో సినిమాలు చేస్తోంది నయన్. అయితే దిగ్గజ దర్శకుడు బాపు డైరెక్టర్ కావడం, ప్రభుదేవాతో పెళ్లి కోసం సినిమాలు మానేయాలి అనుకోవడం, ‘శ్రీరామరాజ్యం’ చివరి సినిమా కావడంతో ప్రమోషన్స్‌కు వచ్చింది నయన్.
ప్రమోషన్స్‌కు దూరంగా ఉండే నయనతార ‘గాడ్ ఫాదర్’ ఈవెంట్స్‌కు వస్తుందని ఊహించారు. చిరంజీవితో జతకట్టిన ‘సైరా నరసింహారెడ్డి’ ప్రమోషన్‌కు నయనతార రాలేదు. ‘గాడ్ ఫాదర్’లో నయనతార చిరంజీవి చెల్లిగా ఇంపార్టెంట్ రోల్ పోషించింది, కానీ ప్రమోషన్స్‌కు మాత్రం రాలేదు. కోట్లు ఇచ్చినా కరగని నయనతార నిర్మాతగా మారేసరికి ప్రమోషన్ వాల్యూ ఏంటో తెలుసుకుంది. ప్రొడ్యూసర్‌గా తీసిన సినిమా ‘కనెక్ట్’ కోసం తెలుగు, తమిళం అన్న తేడా లేకుండా అన్ని చోట్లకూ వెళ్లి ప్రమోట్ చేసింది. సొంత సినిమాకు ఒకలాగా, బయటి సినిమాకు ఒకలాగా వ్యవహరించింది అంటూ అప్పట్లో విమర్శలు ఫేస్ చేసింది.
బిజినెస్‌లోకి అడుగుపెట్టిన నయనతార స్కిన్ కేర్ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చింది. బిజినెస్ ఉమెన్‌గా బ్రాండ్ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ వరుసపెట్టి యాడ్స్‌లో నటించింది. నయనతార దంపతులు మలేషియా వెళ్లి అక్కడ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. బిజినెస్ మీద ఉన్న శ్రద్ధ సినిమా ప్రమోషన్స్‌పై లేదని, “మీరొక్కరే కాదు, నిర్మాతలు కూడా డబ్బులు పెట్టి బిజినెస్ చేస్తున్నారు” అంటూ నెటిజన్లు నయనతారపై మండిపడ్డారు.
సొంత సినిమాలకు, ఓన్ ప్రొడక్షన్స్‌కు మాత్రమే ప్రమోషన్స్ చేసే నయనతారలో కాస్త మార్పు వచ్చింది. ‘మన శంకర వరప్రసాద్’ ప్రమోషనల్ ఈవెంట్స్‌లో ఒక్కదానికీ రాకపోయినా, షూటింగ్ మొదటి రోజు, చివరి రోజు రెండు వీడియోలతో ఆకట్టుకుంది. అనిల్ ఏం మాయ చేశాడో కానీ నయనతారను ప్రమోషన్స్‌కు ఒప్పించాడు అంటూ చిరంజీవి చాలాసార్లు పేర్కొన్నాడు.
ఎప్పుడూ లేనిది ‘టాక్సిక్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నయనతార కనిపించడం అందరికీ షాక్ ఇచ్చింది. యష్ స్వయంగా ఫోన్ చేయడంతో ‘నో’ చెప్పలేకపోయానని, అందుకే వచ్చాను అంటూ అడగకుండానే చెప్పేసింది. ప్రమోషన్స్‌కు రాకపోవడానికి పెద్దగా కారణాలు ఏమీ లేవని, చురుగ్గా పాల్గొనలేను అనే భావనతోనే ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటాను అని వివరణ ఇచ్చింది. ప్రమోషన్లకే కాదు, ఇంటర్వ్యూలకి కూడా దూరంగా ఉండే నయనతార ‘టాక్సిక్’ ఇంటర్వ్యూలలో పాల్గొంటుందని తెలిసిందే. అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ విషయంలో మనసు కరిగి ప్రమోషన్స్‌కు వస్తుందా, లేదంటే ఈ ఛాన్స్ ఒక్క ‘టాక్సిక్’కే పరిమితమో చూడాలి మరి.

