కోలీవుడ్ రొమాంటిక్ కపుల్స్‌లో లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ జంట ఒకటి. సుమారు ఏడేండ్ల పాటు ప్రేమించుకున్న వారు పెద్దల అంగీకారంతో వివాహ బంధంతో ఒకటయ్యారు. పెళ్లైన 4 నెలలకే సరోగసి పద్ధతి ద్వారా నయన్, విఘ్నేశ్ శివన్ దంపతులు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఇక నేడు ఈ జంట మూడో పెళ్లిరోజు. ఈ సందర్భంగా విఘ్నేశ్ శివన్‌కు నయన్ సోషల్ మీడియా ద్వారా స్పెషల్‌గా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపింది. విఘ్నేశ్‌పై తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తూ.. క్యూట్ ఫొటోలను కూడా పంచుకుంది..
Also Read : Aamir Khan : మణిరత్నంతో ఒక్కసారైనా వర్క్ చేయాలి..
‘ఒకరిపై ఒకరు అంతగా ఎలా ప్రేమ చూపుతారే? ఇది ఎప్పటికీ సమాధానం దొరకని ఆశ్చర్యపరిచే విషయం. కానీ.. నీ రూపంలో దానికి నాకు సమాధానం దొరికింది. నీ ప్రేమను వర్ణించడానికి నాకు మాటలు చాలవు. నా మనసు కోరుకునే ప్రేమవు నువ్వు. ఇద్దరిగా ప్రారంభమైన మన ప్రయాణం నలుగురు గా మారింది. ఇంతకు మించి కోరుకోవడానికి ఏముంది. స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందో నువ్వు నాకు చూపించావు. నా జీవిత భాగస్వామికి పెళ్లి రోజు శుభాకాంక్షలు’ అంటూ నయనతార శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అవి చూసిన నెటిజన్లు నయన్-విఘ్నేశ్ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.