తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవీన్ పోలిశెట్టి. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో, సహజమైన నటనతో ప్రేక్షకులను ఈజీగా కనెక్ట్ అయ్యే హీరోగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న చర్చ ఏమిటంటే.. నవీన్ పోలిశెట్టి ఇప్పుడు తెలుగు సినిమాకు ‘ప్రదీప్ రంగనాథన్’లా మారాడని. అంటే.. తక్కువ సినిమాలే చేసినా ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర స్టెడీ గ్రోత్ చూపించే హీరో అన్న మాట. నవీన్ పోలిశెట్టి కెరీర్‌ను పరిశీలిస్తే.. ఈ అభిప్రాయానికి బలమైన కారణాలే కనిపిస్తాయి. తమిళ్ చిత్ర పరిశ్రమలో ప్రదీప్ రంగనాథన్ చేసిన ప్రతి సినిమా హిట్. లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ చిత్రాలు ఘన విజయాలు అందుకున్నాయి.
నవీన్ పోలిశెట్టి హీరోగా చేసిన తొలి సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ బాక్సాఫీస్ వద్ద రూ.25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. థ్రిల్లర్ నేపథ్యంలో హ్యూమర్ మేళవించి తెరకెక్కిన ఈ సినిమా నవీన్‌కు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘జాతి రత్నాలు’ నవీన్ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమా ఏకంగా రూ.75 కోట్ల గ్రాస్ వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక ‘మిస్ పోలిశెట్టి మిస్టర్ పొలిశెట్టి’ కూడా సక్సెస్ బాటలోనే నడిచింది. కంటెంట్, కామెడీ, ఎమోషన్ అన్నింటినీ బ్యాలెన్స్ చేసిన ఈ సినిమా దాదాపు రూ.50 కోట్ల గ్రాస్ వసూలు చేసి నవీన్ మార్కెట్‌ను మరింత బలపరిచింది. తాజాగా విడుదలైన ‘అనగనగా ఒక రాజు’ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరింది.
Also Read: Mega158 Gossip: కృతి శెట్టికి ‘మెగా’ ఛాన్స్.. చిరు కూతురిగా బేబమ్మ?
ప్రతి సినిమాతోనూ నవీన్ పోలిశెట్టి మార్కెట్ గ్రాఫ్ పెరుగుతుండటం గమనార్హం. అదే సమయంలో ఆయనకు బలమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. సాధారణ ప్రేక్షకులతో ఈజీగా కనెక్ట్ అయ్యే డైలాగ్ డెలివరీ, టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ ఆయన బలాలు. స్టార్డమ్ కంటే కథ, పాత్రకు ప్రాధాన్యం ఇస్తూ సినిమాలు ఎంచుకోవడమే నవీన్ విజయ రహస్యం అని చెప్పాలి. మొత్తానికి తక్కువ సినిమాలు చేసినా ప్రతి ప్రాజెక్ట్‌తో ఒక స్టాండర్డ్ సెట్ చేస్తూ ముందుకు వెళ్తున్న నవీన్ పోలిశెట్టి.. తెలుగు సినిమాకు ‘ప్రదీప్ రంగనాథన్’లా మారుతున్నాడన్న అభిప్రాయం సోషల్ మీడియాలో వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఆయన నుంచి మరిన్ని డిఫరెంట్, బ్లాక్‌బస్టర్ సినిమాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.