విక్టరీ వెంకటేశ్, జాతీయ ఉత్తమ నటి ప్రియమణి జంటగా నటిస్తున్న సినిమా ‘నారప్ప’. తమిళ చిత్రం ‘అసురన్’కు ఇది రీమేక్. సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేశ్ బాబుతో కలిసి కలైపులి ఎస్. థాను దీనిని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు స్వరబ్రహ్మ మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ఈ నెల 11 మణిశర్మ పుట్టిన రోజు సందర్భంగా ‘నారప్ప’ సినిమాలోని ‘చలాకీ చిన్నమ్మి’ అనే పాటను ఆదివారం ఉదయం 10 గంటలకు విడుదల చేయబోతున్నారు.
Read Also : ‘తిక్క’ సుందరి తిరిగొస్తానంటే… తేజు ఫ్యాన్స్ తెగ అల్లరి!
కార్తీక్ రత్నం, రావు రమేష్, రాజీవ్ కనకాల ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ‘నారప్ప’ సినిమా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ అందుకుంది. ఈ చిత్రం ఓటీటీలో విడుదల కాబోతోందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నా నిర్మాతలు మాత్రం ఆ విషయమై అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ నిర్మాతలను అక్టోబర్ వరకూ వేచి ఉండమని విజ్ఞప్తి చేయడంతో ‘నారప్ప’ నిర్మాతలూ పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది.