Nara Rohith: ‘కపాలి’తో సర్ప్రైజ్ ఇచ్చిన నారా రోహిత్.. పోస్టర్‌తోనే హైప్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Rohith: టాలీవుడ్ హీరో నారా రోహిత్ మరో కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘కపాలి’ (Kapaali) అనే ఆసక్తికరమైన టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ, “A journey into the UNKNOWN begins here..” అంటూ క్యాప్షన్‌ను పంచుకున్నారు. ఈ అనౌన్స్‌మెంట్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి గన్ని రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. నార్మల్ కథలతో కాకుండా విభిన్న స్టోరీలతో సినిమాలు చేస్తున్న నారా రోహిత్ మరోసారి కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. పోస్టర్లో కనిపించిన థీమ్‌ను బట్టి ఈ చిత్రం మిస్టరీ, థ్రిల్లర్ జానర్లో తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
ఈ సినిమాను విజయ్ కృష్ణ లింగమనేని, కల్యాణ్ మంతిన, భాను ప్రతాప్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్ఏఎమ్డబ్ల్యూతో (SAMW) కలిసి ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక బృందం, షూటింగ్ షెడ్యూల్, విడుదల తేదీ వంటి పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు సమాచారం. విభిన్న కథలను ఎంచుకోవడంలో పేరుగాంచిన నారా రోహిత్, ‘కపాలి’తో మరోసారి ప్రేక్షకులను సరికొత్త అనుభూతికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. ఈ అనౌన్స్‌మెంట్‌తో సినిమాపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.
Also Read
A journey into the UNKOWN begins here…My next #Kapaali. Written & Directed by @GanniRaam @VijayKrishnaLin @Kalyan_manthina @bhanu_pratapa @SAMWoffl pic.twitter.com/0KiSyP6WB1
— Rohith Nara (@IamRohithNara) July 24, 2026
తాజావార్తలు
-
Nara Rohith: ‘కపాలి’తో సర్ప్రైజ్ ఇచ్చిన నారా రోహిత్.. పోస్టర్‌తోనే హైప్!
-
Price Change: 200MP కెమెరా, 6510mAh బ్యాటరీ, 16GB RAM గల Vivo ఫోన్.. ధరలో మార్పులు..
-
Mandula Samuel : కాంగ్రెస్‌లో కాక రేపిన సామేల్.. కోమటిరెడ్డి బ్రదర్స్‌పై ఫైర్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
CJP Protest: జంతర్ మంతర్ వద్ద సంచలనం.. పోలీస్ కానిస్టేబుల్ రాజీనామా..
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!