The Paradise Trailer: నాని మాస్ విశ్వరూపం.. ‘ది ప్యారడైజ్’తో బాక్సాఫీస్ బద్దలేనా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Paradise Trailer: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. ఇప్పటి వరకు తీసింది కేవలం ఒక్కటంటే ఒకే ఒక్క సినిమా. కానీ ప్రస్తుతం ఆయన తీస్తున్న రెండో సినిమాకి మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడలేనంత క్రేజ్ ఏర్పడింది. దసరా సినిమాతో ఫస్ట్ టైం మెగాఫోన్ పట్టి న్యాచురల్ స్టార్ నాని కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాన్ని అందించిన ఈ యువ దర్శకుడు.. ఇప్పుడు అదే న్యాచురల్ స్టార్ నానితో దసరా కంటే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ది ప్యారడైజ్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ కయాదు లోహర్ నటిస్తుండగా, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ ఈ సినిమాపై ఉన్న అంచనాలను అంతకంతకూ పెంచుకుంటూపోయాయి.
తాజాగా మేకర్స్ ఈ రోజు ది ప్యారడైజ్ అఫీషియల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. గతంలో హిట్ 3 లో నాని వయొలెంట్ అవతార్ చూసిన ప్రేక్షకులకు ది ప్యారడైజ్ నాని కనిపించిన తీరు చూస్తే అది ఈ సినిమా ముందు జస్ట్ ట్రైలర్ మాత్రమే అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే ఈ సినిమాలో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నానితో బ్లడ్ బాత్ చేయించినట్లు టీజర్ కట్ చేశారు. ఈ చిత్రంలో వినిపించిన 3, 4 డైలాగ్స్ ఇప్పటి వరకు సినిమాపై ఉన్న హైప్ డబుల్ చేసేలా ఉన్నాయి. మొత్తంగా చూస్తే నాని – ఓదెల కాంబినేషన్లో వస్తున్న ది ప్యారడైజ్ బాక్సాఫీస్ వద్ద సంచనాలను నమోదు చేయడం పక్కా అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 సెప్టెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Also Read
తాజావార్తలు
-
The Paradise Trailer: నాని మాస్ విశ్వరూపం.. ‘ది ప్యారడైజ్’తో బాక్సాఫీస్ బద్దలేనా!
-
UK: ఆర్మీ కాలేజీలో మహిళలపై అత్యాచారాలు.. యూకేను కుదిపేస్తున్న ఘటన..
-
Rahul Gandhi: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఫోన్.. ఏం సంభాషణ జరిగిందంటే..!
-
Minister Anitha: జగన్ బయటకు వస్తే విధ్వంసమే.. పరామర్శల పేరుతో అరాచకం.. మంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు
-
Team India Selection: 97 కేజీల బరువు ఉన్నా భారత్ జట్టులోకి ఎంపిక… బీసీసీఐపై ఆగ్రహ జ్వాలలు..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!