Moses Manikchand Part-2: ఆసక్తికరంగా ‘మోసెస్ మాణిక్‌చంద్ పార్ట్-2’ ఫస్ట్ లుక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటుడు సిద్ధు జొన్నలగడ్డ అన్న చైతు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో #MM పార్ట్-2ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇదివరకే ప్రకటించారు. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇది వరకు విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేశారు. చైతు ఈ చిత్రానికి ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌ను కూడా అందించారు. ఈ చిత్రానికి బొమ్మ బ్లాక్ బస్టర్ ఫేమ్ రాజ్ విరాట్ దర్శకత్వం వహించనున్నారు. నవంబర్ 14న నేచురల్ స్టార్ నాని సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించి, టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. మోసెస్ మాణిక్‌చంద్ పార్ట్-2 అనే టైటిల్‌తో రాబోతోన్న ఈ చిత్రం డిఫరెంట్‌గా ఉండబోతోందని పోస్టర్‌ను చూస్తేనే తెలుస్తోంది. ఈ పోస్టర్‌లో మద్యం బాటిల్, క్లాప్‌బోర్డ్, అమ్మాయి, వైన్ గ్లాస్ ఇలా అన్నీ కనిపిస్తున్నాయి.
Sai Dharam Tej: పవన్ కళ్యాణ్ కాళ్లపై పడ్డ ధరమ్ తేజ్
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
పైగా ఈ చిత్ర పోస్టర్‌ను చిల్డ్రన్స్ డే సందర్భంగా రిలీజ్ చేస్తూ.. హ్యాపీ ‘నో చిల్డ్రెన్స్’ డే అని పెట్టారు. దీంతో మరింత ఆసక్తికరంగా మారింది. ఇక చైతు జొన్నలగడ్డ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రాజకుర్చీపై రాజసం ఉట్టి పడేలా కూర్చుండగా.. భారీ ఆభరణాలు, స్టైలిష్ హెయిర్, లేత గడ్డం, సన్ గ్లాసెస్‌తో డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఒంటిపై ఆ టాటూలు పాత్ర తీరు, స్వభావాన్ని సూచించేలా ఉన్నాయి. ఈ మూవీకి పెట్టిన ట్యాగ్‌లైన్ ‘ఎ రియల్ విలన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దేన్ ఎ ఫేక్ హీరో’ కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉంది. పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండబోతోంది. ఈ ప్రాజెక్ట్‌కి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా, కృతి ప్రసాద్ క్రియేటివ్ ప్రొడ్యూసర్. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!