యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తనకు హిట్ ఇచ్చిన దర్శకుడితో మరో సినిమాకు సిద్ధమవుతున్నారు. సినిమాటోగ్రాఫర్ నుంచి డైరెక్టర్ గా మారిన కేవీ గుహన్ దర్శకత్వంలో ఈ హీరో నెక్స్ట్ మూవీ రూపొందబోతోంది. ఈరోజు కళ్యాణ్ రామ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన 20వ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేయగా… అందులో ఉన్న “క్రైమ్ సీన్ డు నాట్ క్రైమ్” అనే లైన్ చూస్తుంటే ఈ మూవీ సస్పెన్స్ అండ్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందనుంది అన్పిస్తోంది. దిల్ రాజు ఈ ఆసక్తికరమైన చిత్రాన్ని నిర్మించనున్నారు. మిగతా తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.
Read Also : నాలుగవసారి స్టార్ హీరోతో హిట్ డైరెక్టర్… టైటిల్ పోస్టర్ రిలీజ్
కాగా ‘పటాస్’ తరువాత వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న కళ్యాణ్ రామ్ కు “118” అనే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ తో దర్శకుడు గుహన్ మంచి హిట్ ను ఇచ్చారు. 2019లో విడుదలైన ఈ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. మళ్ళీ ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ “బింబిసార” అనే భారీ పీరియాడికల్ మూవీతో బిజీగా ఉన్నారు.