రెండు నెలల పాటు మూగబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్.. ఇప్పుడు ‘బింబిసార’ పుణ్యమా అని గర్జిస్తోంది. అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా ఆకట్టుకోవడంతో, ప్రేక్షకులు థియేటర్లపై దండయాత్ర చేస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ తాజాగా నటించిన చిత్రం ‘బింబిసార’. చాలాకాలం తర్వాత కల్యాణ్ రామ్ ఈ చిత్రంతో కంబ్యాక్ ఇచ్చాడు. ఫాంటిసీ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎన్‌టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్‌రామ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. కళ్యాణ్‌రామ్‌కు జోడీగా కేథరీన్ ట్రెసా, సంయుక్త మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. ఈసినిమాకు కీరవాణి సంగీతం అందించాడు. అయితే.. ఇక ఇప్పటికే ఈ చిత్రం కళ్యాణ్‌రామ్‌కు దాదాపు 10కోట్లకు పైగా ప్రాఫిట్స్‌ను తెచ్చిపెట్టింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాను చూసి బింబిసార బృందాన్ని అభినందించారు.
తాజాగా నందమూరి బాలకృష్ణ యూనిట్ సభ్యులతో కలిసి ఈ సినిమాను వీక్షించిన ఆయన మూవీ టీంని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. హీరో కల్యాణ్‌రామ్ నటనపై ఆయన ప్రశంసలు కురిపించారు. నందమూరి బాలకృష్ణతో పాటు, హీరో కళ్యాణ్‌రామ్ భార్య స్వాతి, సోదరి సుహాసిని కూడా బింబిసార చిత్రాన్ని చూశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
హీరో కళ్యాణ్‌రామ్ చాలా కాలం తర్వాత బింబిసార సినిమాతో ఓరేంజ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కల్యాణ్ రామ్ పటాస్ తర్వాత దాదాపు ఎనిమిదేళ్లకు బింబిసారతో కమర్షియల్ హిట్‌ను సాధించాడు. అయితే.. భారీ అంచనాల నడుమ ఆగస్టు 5న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండి పాజిటీవ్ టాక్‌ను తెచ్చుకొని వసూళ్ళ సునామీని సృష్టిస్తుంది. అంతేకాదు.. కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది.
Some special pictures from the special screening of #Bimbisara for Natasimham #NandamuriBalakrishna garu❤️
The team is all smiles & pumped up with roaring energy 💥🔥@NANDAMURIKALYAN @DirVassishta pic.twitter.com/AbUWQJnpRM
— NTR Arts (@NTRArtsOfficial) August 13, 2022