Balakrishna : బాలకృష్ణకు తీవ్ర గాయం.. ఏఐజీ ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రమాదానికి గురయ్యారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న సినిమా షూటింగ్లో పాల్గొంటున్న సమయంలో షూటింగ్ సమయంలో ఆయన ఎడమ మోకాలికి తీవ్ర గాయమవ్వడంతో వెంటనే చిత్రబృందం ఆయన్ను స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించింది. అయితే మెరుగైన వైద్య సేవలు, ప్రత్యేక పరీక్షల కోసం ఆయన్ను అత్యవసరంగా ఎయిర్‌లిఫ్ట్ ద్వారా హైదరాబాద్ తీసుకొచ్చి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనతో నందమూరి అభిమానులు ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ప్రస్తుతం ఏఐజీ ఆసుపత్రి వైద్యులు బాలయ్య ఆరోగ్య పరిస్థితిపై అధికారికంగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
ఆసుపత్రి వర్గాలు వివరాల ప్రకారం.. బాలకృష్ణ ఎడమ మోకాలి పరిస్థితిపై ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. ఎడమ మోకాలి చుట్టూ ఉన్న కణజాలాల్లో రక్తం గడ్డకట్టడంతో పాటు తీవ్రమైన వాపు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఇది మజిల్ టేర్ సూచిస్తోందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం పర్యవేక్షణలో ఆయనకు విస్తృతమైన క్లినికల్, డయాగ్నస్టిక్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బాలకృష్ణ గత వైద్య చరిత్రను దృష్టిలో ఉంచుకుని, ఆయనకు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా సురక్షితమైన చికిత్స అందించేందుకు వివిధ విభాగాల నిపుణులతో కూడిన ‘మల్టీడిసిప్లినరీ’ వైద్య బృందాన్ని రంగంలోకి దించారు.
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
“ప్రస్తుతం బాలకృష్ణగారి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉంది. ఆయన వైద్యుల నిరంతర పర్యవేక్షణలోనే ఉన్నారు. డయాగ్నస్టిక్ పరీక్షల నివేదికలన్నీ వచ్చిన తర్వాతే తుది చికిత్స ప్రణాళికను ఖరారు చేస్తాం. ఆరోగ్యానికి సంబంధించిన తదుపరి వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తాం.” ఏఐజీ ఆసుపత్రి వర్గాలు
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!