నమ్రతా శిరోద్కర్ సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. మాజీ మిస్ ఇండియా కిరీటాన్ని అందుకున్న నమ్రత పలు సినిమాలలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. అదే సమయంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుని వివాహమాడి సినిమాలకు టాటా చెప్పేస్తుంది నమ్రత. కానీ అప్పుడప్పుడు స్పెషల్ ఫొటో షూట్స్ తో పాటు మహేశ్ తో పాటు స్పెషల్ ఫొటోస్ ను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది నమ్రత. లేటెస్ట్ గా మరోసారి స్పెషల్ ఫోటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫేమస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ధరించిన లాంగ్ డ్రెస్ లో మెరిసిపోతుంది. అలాగే సిద్దార్ధ్ జ్యువలరీస్ ఆభరణాలు ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది నమ్రత. ప్రముఖ జ్యూవెలరీ డిజైనర్ నాగిని ప్రాసాద్ డిజైన్ చేసిన స్పెషల్ డిజైన్డ్ ఆభరాలతో ఈ జనరేషన్ హీరోయిన్స్ పోటీ ఇస్తోంది నమ్రతా శిరోద్కర్. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరోసారి మహేశ్ తో ఏదైనా సినిమాలో తళుక్కున మెరిస్తే చూడాలని ఉందని, మిస్ ఇండియా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని కామెంట్స్ చేస్తున్నారు.