హరినాథ్ పోలిచర్ల రచన, దర్శకత్వ నిర్మాణంలో డ్రీం టీం ప్రొడక్షన్స్ పై హరినాథ్ పోలిచర్ల హీరోగా తనికెళ్ళ భరణి, రఘు బాబు, జరీనా వహాబ్, నిధి పాల్, రోనీ కౌలా, సుఫియా తన్వీర్ తదితరులలో ప్రేక్షకుల ముందుకు రానున్న “నా తెలుగోడు”. మళ్లీ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి శివ సంగీతాన్ని అందించగా రమణ ఎడిటింగ్ చేశారు. చంద్ర బోస్, గడ్డం వీరు ఈ చిత్రంలోని పాటలు రచించారు. డిసెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న “నా తెలుగోడు” సినిమాకు సంబంధించిన విషయాలు హరినాథ్ పోలిచర్ల మీడియాతో పంచుకోవడం జరిగింది.
నా తెలుగోడు అనే సినిమా షూటింగ్, సెన్సార్ పూర్తిచేసుకుని డిసెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాము. సమాజానికి ఉపయోగపడే ఒక విషయాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వెళ్ళాలి అనే ఉద్దేశంతో చేసాము. ఒక సైనికుడు దేశం కోసం జీవితాన్ని త్యాగం చేస్తారు. వారి జీవితం పై, ఆడపిల్లలను కాపాడటంపై, డ్రగ్స్ నుండి సమాజాన్ని కాపాడే కొన్ని అంశాలను ఈ సినిమాలో చూపించాలి అనే ప్రయత్నం చేశాము. నందమూరి తారక రామారావు గారి వల్ల తెలుగు వారికి మంచి గుర్తింపు వచ్చింది. ఆయన నాకు ఇన్స్పిరేషన్. అన్నగారి సినిమాలు అంటే చాలా ఇష్టం. నా తెలుగోడు అనే టైటిల్ పెట్టడం గర్వంగా ఉంది.
సినిమాల ద్వారా మనం చెప్పాలి అనుకునేది ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా చెప్పొచ్చు అని సినిమా చేశాము. సినిమాలో యుద్ధ నేపద్యంలో కొన్ని సీన్స్ ఉంటాయి. గోవా, మునార్, హైదరాబాద్ ఇంకా కొన్ని ప్రాంతాలలో ఈ సినిమాను చిత్రీకరించడం జరిగింది. సినిమాకు కట్స్ లేకుండా A సర్టిఫికెట్ రావడం మాకు సంతోషకరం. ఈ సినిమాను హిందీలో ఆర్ కె పేరిట కూడా విడుదల చేయనున్నాము. తెలుగు రాష్ట్రాలలో 60 థియేటర్లలో విడుదల చేయనున్నాము. తనికెళ్ళ భరణి, రఘు బాబు, జరీనా వహాబ్, నిధి పాల్, రోనీ కౌలా, సుఫియా తన్వీర్ తదితరులు నటించడం సినిమాకు బలంగా మారింది.