అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆరేళ్లుగా పైగా అవుతున్న.. సరైన హిట్ కోసం ఎదురుస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాని దాదాపుగా పూర్తిచేసుకొని విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు అఖిల్-సురేందర్ దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అఖిల్ తన లుక్ ని మార్చుకొని, కొత్త గెటప్ లో కనిపిస్తున్నాడు. ఇదిలావుంటే, అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌లో అఖిల్ ఓ చిత్రం చేయబోతున్నాడని వినిపిస్తోంది. ఓ మంచి ప్రేమకథ సినిమాని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారని తెలుస్తోంది.