‘పెళ్లిసందD’ మూవీ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ శ్రీ లీల. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుని వరుస ఆఫర్లు కొట్టేసింది. ‘ధమాకా’ తో మొదలు ఆదికేశవ, గుంటూరు కారం, స్కంద, భగవంత్ కేసరి, ఎక్స్‌టాఆర్టినరీ మ్యాన్ ఇలా వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసేదింది. ఈ క్రమంలోనే రెండు మూడు ప్లాపులు తగిలేసరికి సైలెంట్ అయిపోయింది. తర్వాత ‘పుష్ప2’లో కిస్సిక్ సాంగ్‌తో ఒక్కసారిగా పడిలేచిన ఈ ముద్దుగుమ్మ, ప్రజంట్ నితిన్ సరసన ‘రాబిన్‌హుడ్’తో మళ్లీ తెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 28న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక విడుదల సమయం దగ్గర పడుతుండడంతో మూవీ టీం ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ లీల ఓ మీడియాతో ముచ్చటించింది.
‘నితిన్‌తో పనిచేయడం కంఫర్టబుల్‌గా ఉంది, సినిమా విషయంలో టీం అంతా చాలా కాన్ఫిడెన్స్‌తో ఉన్నాం, చక్కని క్వాలిటీతో రిచ్‌గా సినిమా ఉంటుంది. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్‌ల ట్రాక్‌ని షూట్ చేస్తున్నప్పుడే పడిపడి నవ్వుకున్నాం, వీరి సీన్స్ హిలేరియస్‌గా ఉంటాయి. ఇక నా పాత్ర గురించి చెప్పాలి అంటే ఇందులో నా పాత్ర పేరు నీరా వాసుదేవ్. ఫారిన్ నుంచి ఇండియా వచ్చిన అమ్మాయిని. నాకు నేను ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటా. ఈ ప్రపంచమంతా నా చుట్టూనే ఉంటుందని ఫీలవుతుంటా. క్యూట్‌గా బబ్లీగా నా పాత్రను దర్శకుడు వెంకీ కుడుముల భాగా డిజైన్ చేశారు. మీకు తప్పకుండా నచ్చుతుంది.’ అని శ్రీలీల చెప్పుకొచ్చింది.