Splitsvilla: ‘ప్రేమ కావాలా? పైసా కావాలా?’: జియోహాట్‌స్టార్ తెలుగులో ‘ఎమ్‌టీవీ స్ప్లిట్స్‌విల్లా X6’ స్ట్రీమింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాపులర్ యూత్ డేటింగ్ రియాలిటీ షో ‘ఎమ్‌టీవీ స్ప్లిట్స్‌విల్లా’ (MTV Splitsvilla). ఇప్పుడు ఈ షో సరికొత్త సీజన్‌తో, ఊహించని ట్విస్టులతో, మరింత బోల్డ్ అండ్ స్పైసీగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే ఈసారి తెలుగు ఆడియన్స్‌కు ఓ అదిరిపోయే శుభవార్త! చరిత్రలో తొలిసారిగా ఈ ప్రతిష్టాత్మక షో 16వ సీజన్ ‘ఎమ్‌టీవీ స్ప్లిట్స్‌విల్లా X6: ప్యార్ యా పైసా’ పేరుతో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. గత సీజన్ ఫినాలేలో కంటెస్టెంట్లు దిగ్విజయ్, కాశిష్ తీసుకున్న అనూహ్య నిర్ణయాల వల్ల ఏర్పడిన ఉత్కంఠను ఆధారంగా చేసుకుని, ఈ కొత్త సీజన్‌ను మరింత రసవత్తరంగా డిజైన్ చేశారు.
మహాబలిపురం సముద్ర తీరంలో ఈ సీజన్ షూటింగ్ జరిగింది. మొత్తం 33 మంది హాట్ అండ్ సింగిల్ యువతీ యువకులు ఇందులో కంటెస్టెంట్లుగా అడుగుపెట్టారు. వీరిని ప్రధానంగా ‘ప్యార్ విల్లా’ (ప్రేమ ఇల్లు), ‘పైసా విల్లా’ (డబ్బు ఇల్లు) అనే రెండు భిన్నమైన విభాగాలుగా విడదీశారు. అసలు ఈ 33 మందిలో ప్రేమను గెలిపించేది ఎవరు? డబ్బుకు ఆకర్షితులయ్యేది ఎవరు? ప్రేమ, డబ్బు మధ్య జరిగే ఈ ఆసక్తికరమైన మైండ్ గేమ్‌లో నెగ్గి తమకు తగిన జోడీని ఎవరు వెతుక్కుంటారు? అన్నదే ఈ సీజన్ ప్రధాన ఆకర్షణ. ఈ భారీ రియాలిటీ షోకు గ్లామర్ అద్దేందుకు బాలీవుడ్ బ్యూటీ, ‘క్వీన్ ఆఫ్ హార్ట్స్’ సన్నీ లియోన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. స్ప్లిట్స్విల్లాతో ఆమెకు దశాబ్ద కాలంగా విజయవంతమైన అనుబంధం ఉంది. ఈసారి ఆమెకు తోడుగా ‘కింగ్ ఆఫ్ హార్ట్స్’ కరణ్ కుంద్రా కో-హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి షోలో సరికొత్త జోష్ నింపారు.
Also Read
- Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
- Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
- The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
తాజావార్తలు
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
Lava Virat Curve 5G: లావా Virat Curve 5G వచ్చేసింది.. 50MP కెమెరా, Dimensity 7100, 6000mAh బ్యాటరీ
-
Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
-
Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
ట్రెండింగ్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!