Mothevari Love Story: ‘మోతెవరి లవ్ స్టోరీ’కి సూపర్ రెస్పాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ZEE5 గ్రామీణ తెలంగాణ ప్రాంతంలోని మూలాల్ని ప్రతిబింబించేలా ‘మోతెవరి లవ్ స్టోరీ’ని ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చింది. ఇందులో అనిల్ గీలా, వర్షిణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఆగస్టు 8న ప్రీమియర్ అయిన ఈ సిరీస్ సంచలనాత్మక స్పందనను దక్కించుకుంది. విడుదలైన మూడు రోజుల్లోనే 2,00,000 మందికి పైగా వీక్షకులను ఆకర్షించింది. శివ కృష్ణ బుర్రా రచన, దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మురళీధర్, సదన్న, విజయ లక్ష్మి, సుజాత ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్, మై విలేజ్ షో బ్యానర్‌లపై మధుర శ్రీధర్, శ్రీరామ్ శ్రీకాంత్ ‘మోతెవరి లవ్ స్టోరీ’ని నిర్మించారు.
Also Read : Tollywood : ప్రొడ్యూసర్స్.. ఎందుకీ రెండు నాల్కల ధోరణి?
Also Read
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ‘మోతెవరి లవ్ స్టోరీ’ ఆరెపల్లి గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆ ఊర్లోని పర్షి (అనిల్ గీలా) అనే యువకుడి చుట్టూ కథ నడుస్తుంది. అతను సత్తయ్య (మురళీధర్ గౌడ్) కుమార్తె అనిత (వర్షిణి)తో ప్రేమలో పడతాడు. కానీ సత్తయ్య, అతని సోదరుడు నర్సింగ్ (సదన్న) తమ దివంగత తండ్రి రాసిన ఓ వీలునామాను బయటపడటం, దీంతో ఓ భూ వివాదం చెలరేగడం.. ఇక దీంతో హాస్యం, భావోద్వేగాలు పుట్టుకు రావడం, చివరకు ఊహించని మలుపులకు దారి తీయడం జరుగుతుంది. విడుదలైనప్పటి నుండి ఈ సిరీస్ గ్రామీణ ప్రాంతాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ZEE5 లోని ట్రెండింగ్ చార్టులలో ఈ సిరీస్ అగ్రస్థానంలో నిలిచింది. 3 రోజుల్లో 2,00,000లకు పైగా వీక్షకులను ఆకర్షించి కొద్ది కాలంలోనే ‘మోతెవరి లవ్ స్టోరీ’ తెలుగు రాష్ట్రాలలోని అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకునేలా ఉంది.
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?