లాస్ట్ ఇయర్ మల్కోట్టై వాలిబన్, బర్రోజ్ లాంటి భారీ ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్న మోహన్ లాల్.. ఈ ఏడాది వాటన్నింటి లెక్కలు సరిచేశాడు. ఎంపురన్, తుడరుమ్, హృదయ పూర్వంతో హ్యాట్రిక్ హిట్ కొట్టడమే కాదు.. హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్ మూవీస్ ఖాతాలో వేసుకుని లాలట్టన్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నారు. అంతే కాదు కొంతకాలంగా స్పెయిన్‌లో గడిపి బ్రేక్ తీసుకొని, ఆ తర్వాత ఇండియా రిటర్న్ అయ్యాక కొడుకు ప్రణవ్ కూడా డీఎస్ ఈరేతో సూపర్ హిట్ అందించి పుత్రోత్సాహాన్ని ఇచ్చాడు. అటు కూతుర్ని హీరోయిన్ చేసే పనిలో బిజీగా ఉన్నారు కంప్లీట్ స్టార్. కానీ ఆయన ఫ్రెండ్ మమ్ముట్టి మాత్రం హిట్స్ లేక సతమతమౌతున్నారు.
Also Read : SS Rajamouli : నాకు దేవుడి మీద నమ్మకం లేదు.. రాజమౌళిపై విమర్శలు
మాలీవుడ్ స్టార్ హీరో ముమ్ముట్టిది మరో లెక్క. పుత్రుడు దుల్కర్ సల్మాన్‌తో ప్రాబ్లమ్ లేదు. ఆయన్నే వరుస పరాజయాలు పలకరిస్తున్నాయి. లాస్ట్ యర్ వచ్చిన బ్రహ్మాయుగం, టర్బో హిట్స్‌గా నిలవగా.. ఈ ఏడాదొచ్చిన డొమినిక్ ది లేడీస్ పర్స్, భజూక చిత్రాలు డిజాస్టర్లుగా మారాయి. అసలు ఈ సినిమాలు ఎప్పుడొచ్చాయో పోయాయే కూడా తెలియలేదు కేరళ ఆడియన్స్‌కు. అంతలోనే అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. అన్నీ కుదుటపడటంతో నెక్స్ ఫిల్మ్ లోడ్ చేస్తున్నారు మమ్ముట్టి. కళంకావల్ అనే యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌తో రాబోతున్నాడు మమ్ముట్టి. జైలర్‌లో విలన్ రోల్‌తో భయపెట్టిన వినాయకన్ ఇందులో పవర్ ఫుల్ రోల్ చేయబోతున్నాడు. దుల్కర్ సల్మాన్ కురుప్ చిత్రానికి స్టోరీ అందించిన జితిన్ కె జోస్ ఈ సినిమాకు దర్శకుడు కాగా మమ్ముట్టి ఓన్ ప్రొడక్షన్ హౌస్ మమ్ముట్టి కంపెనీ నిర్మించింది. నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి మాలీవుడ్ సూపర్ స్టార్ ఈ సినిమాతో హిట్ కొట్టి పాత లెక్కలన్నీ సరిచేస్తాడో లేదో ఈ మంత్ ఎండింగ్ తేలిపోనుంది.