మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వరుసగా రెండు పెద్ద హిట్స్ ఇచ్చారు. మొదట L2: ఎంపురాన్ వచ్చి బ్లాక్ బస్టర్ అవ్వగా. తర్వాత క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘తుడరుమ్’ నిశ్శబ్దంగా విడుదలైంది. శోభన హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఊహించని విద్ధంగా బాక్సాఫీసు వద్ద రెండు వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కేరళ బాక్సాఫీసు వద్దే రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన తొలి మలయాళ సినిమాగా ‘తుడరుమ్’ రికార్డు నెలకొల్పింది. అయితే అన్ని అంశాలూ బాగుండి సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చేందుకు సిద్ధమైంది.
Also Read : Rukmini Vasanth : ఆ ఒక్క మెసేజ్ నా జీవితాన్నే మార్చేసింది..
ఈ రోజుల్లో, మలయాళ సినిమాలు భారతదేశం అంతటా ఇష్టపడతున్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ మలయాళి మూవీస్ ని బాగా ఏంజయ్ చేస్తున్నారు. వాటి OTT విడుదల కోసం చూస్తున్నారు. ఇందులో భాగంగానే ‘తుడారుమ్’ కోసం కూడా చాలా మంది ఆన్లైన్లో చూడటానికి వేచి ఉన్నారు. మొత్తనికి జియో హాట్ స్టార్ లో ఈ నెల 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది.