Mohan Babu Review for Kalki 2898 AD: విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నం ఓపస్ ‘కల్కి 2898 AD’. ఈ విజువల్ వండర్ లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె లీడ్ రోల్స్ లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మైథాలజీ -ఇన్స్ స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ జూన్ 27న గ్రాండ్ గా విడుదలై ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షులని మహా అద్భుతంగా అలరించి, యునానిమాస్ ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది.
Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’లో కృష్ణుడి పాత్రలో కనిపించింది సూర్య ఫ్రెండా?
ఈ నేపధ్యంలో ఈ సినిమా చూసిన సెలబ్రిటీలు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మోహన్ బాబు స్పందించారు. ఈ రోజే ‘కల్కి’ సినిమా చూశాను. అద్భుతం… మహాద్భుతం…! మా బావ ప్రభాస్‌కి, అమితాబ్ బచ్చన్ గారికి, నిర్మాతకు, దర్శకుడికి నా అభినందనలు. తెలుగు సినీ పరిశ్రమ, భారతదేశం గర్వించదగ్గ సినిమాని అందించినందుకు ఎంతో ఆనందిస్తున్నాను అంటూ ఆయన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
ఈ రోజే ‘కల్కి’ సినిమా చూశాను. అద్భుతం… మహాద్భుతం…!
మా బావ ప్రభాస్‌కి, అమితాబ్ బచ్చన్ గారికి, నిర్మాతకు, దర్శకుడికి నా అభినందనలు.
తెలుగు సినీ పరిశ్రమ, భారతదేశం గర్వించదగ్గ సినిమాని అందించినందుకు ఎంతో ఆనందిస్తున్నాను.#Kalki2898AD #Prabhas @SrBachchan @nagashwin7…— Mohan Babu M (@themohanbabu) June 29, 2024