వాచస్పతి దర్శకత్వంలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘మిస్సింగ్ మేఘన’ చిత్రంలోని రెండో లిరికల్ సాంగ్‌ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గ్రాండ్‌గా విడుదల చేశారు. పాట సాహిత్యం, ఆర్.ఆర్. ధృవన్ అందించిన సంగీతం అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించిన ఆయన, ఈ సినిమా ఘన విజయం సాధించాలని చిత్ర బృందానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ల, ప్రొడ్యూసర్ల మద్దతు లభిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్ ఆవిష్కరించగా, ఫస్ట్ సింగిల్ “పిల్ల పిల్ల పిల్ల”ను లెజెండరీ నిర్మాత సురేష్ బాబు లాంచ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు.
దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ ఎంతో మంది కొత్త ప్రతిభావంతులకు ఇండస్ట్రీలో అవకాశాలు కల్పించిన దిల్ రాజు చేతుల మీదుగా మా సెకండ్ సాంగ్ లాంచ్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్, తొలి పాటకు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ తో పాటు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఇదొక క్యూట్ లవ్ స్టోరీతో ముడిపడిన ఎమోషనల్ థ్రిల్లర్. ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కడా మిస్ కాకుండా కథను చాలా ఆసక్తికరంగా మలిచాం. ఇండస్ట్రీలో ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన దిల్ రాజు గారు మనస్ఫూర్తిగా పాట బాగుందని మెచ్చుకుని, మా చిత్రాన్ని బ్లెస్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన చెప్పినట్లే సినిమా కూడా అద్భుతంగా వచ్చింది, ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. సంగీత దర్శకుడు ఆర్.ఆర్. ధృవన్ మాట్లడుతూ సంగీతంపై ఎంతో పట్టున్న దిల్ రాజు గారి సినిమాల్లోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ అవుతాయి. అలాంటి అద్భుతమైన టేస్ట్ ఉన్న రాజు గారు నేను స్వరపరిచిన ఈ పాటను విని బాగుందని మెచ్చుకోవడం నాకు మరింత ఉత్సాహాన్నిచ్చిందని అన్నారు.

