Missing Meghana : ‘సినిమా అంటే డబ్బు కాదు.. కొందరి జీవితం’.. దామోదర్ ప్రసాద్ ఎమోషనల్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్న సినిమాగా మొదలై ఆసక్తి రేపుతున్న చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. రామ్ కార్తీక్, అంకిత్ కొయ్య, అమ్ము అభిరామి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 18న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో అత్యంత ఘనంగా నిర్వహించిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేదికపై ఆయన చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. “ఒక సినిమా అంటే కేవలం డబ్బు కాదు.. అందులో పని చేసే ఎంతో మంది జీవితం ముడిపడి ఉంటుంది. ఒక నిర్మాతకు కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యం, సినిమా విడుదల తేదీ వరకు గట్టిగా నిలబడాలి. ఎటువంటి కష్టాలు వచ్చినా సినిమా కోసం ముందుకెళ్లాలి” అని దామోదర్ ప్రసాద్ గారు తన అనుభవాలను పంచుకుంటూ చిన్న సినిమాలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. తను ఈ సినిమాకు సపోర్ట్ చేయడానికి హీరో రామ్ కార్తీకే ముఖ్య కారణమని, ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్ కు మంచి టాలెంట్ ఉందని ఆయన కొనియాడారు.
ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్‌పై పంచుమర్తి నరేష్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి వాచస్పతి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్ గారు, ఫస్ట్ సింగిల్ ను ప్రముఖ నిర్మాత సురేష్ బాబు గారు లాంచ్ చేయడం ఈ చిత్రానికి మంచి బజ్ క్రియేట్ చేసింది. సీనియర్ నటుడు గోపరాజు రమణ మాట్లాడుతూ.. “ఒక మంచి కుటుంబ కథను తీసుకుని అందులో అన్ని రకాల జానర్స్ ను ఇమడ్చడంలో దర్శకుడు వాచస్పతి సక్సెస్ అయ్యారు. మంచి మలుపులతో సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు” అని కితాబిచ్చారు. ఆర్.ఆర్. ధృవన్ అందించిన సంగీతం, పాటలు సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి. శామ్. కె. నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. హీరోలు రామ్ కార్తీక్, అంకిత్ కొయ్యలు మాట్లాడుతూ తమకు సపోర్ట్ చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రేక్షకులు సెప్టెంబర్ 18న ఈ చిత్రాన్ని చూసి ఆశీర్వదించాలని కోరారు. ఒక బలమైన కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి!
Also Read
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
- AK 47 Release Date Leaked: 'ఆదర్శకుటుంబం' రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
- Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
తాజావార్తలు
-
Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
-
Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
-
Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
-
Flipkart BBD: 6000 mAh బ్యాటరీ.. ఏఐ+ బ్రాండ్‌లో 5 స్మార్ట్ ఫోన్స్.. భారీ డిస్కౌంట్లు..
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!