ఈగల్ సినిమా ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మిరాయ్ అనే సినిమా చేసాడు యంగ్ హీరో తేజ సజ్జా. మంచు మనోజ్ విలన్ గా నటించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న పాన్ ఇండియా భాషలలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. తేజ సూపర్ యోధగా మంచు మనోజ్ యాంటోగనిస్టుగా అదరగొట్టారు. వరల్డ్ వైడ్ గా సూపర్ కలెక్షన్స్ తో వంద కోట్ల మార్క్ అందుకునేందుకు అడుగు దూరంలో ఉంది.
Also Read : SSMB : లిటిల్ హార్ట్స్ సినిమాకు ‘లిటిల్ హార్ట్స్ సేవియర్’ సూపర్ స్టార్ మహేశ్ స్పెషల్ విషెస్
కాగా ఈ సినిమా సాధించిన విజయాన్ని పీపుల్స్ మిడియా భారీగా సెలెబ్రేట్ చేస్తోంది. తాజగా ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ ను విజయవాడలో నిర్వచించారు. ఈ సందర్భంగా నిర్మాత విశ్వప్రసాద్ కీలక వ్యాక్యలను చేసారు. ఆయన మాట్లాడుతూ ‘ ఇటీవల సినిమాలు హిట్ అయితే హీరోలకు దర్శకులకు గిఫ్ట్స్ లు ఇస్తున్నారు నిర్మాతలు. మేము కూడా హీరో తేజ, మనోజ్ కు అలాగే డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేనికి కార్స్ గిఫ్ట్ గా ఇస్తాం. వాళ్లకి నచ్చిన కార నుగిఫ్ట్ గా ఇస్తాం’ అని అన్నారు. మరోవైపు మిరాయ్ వర్కింగ్ డేస్ లోను అదరగొడుతుంది. సోమ,మంగళవారాల్లోనూ సూపర్ హోల్డ్ చేసింది మిరాయ్. వరుసగా ప్లాపులు ఇస్తున్న పీపుల్స్ మీడియాకు భారీ హిట్ ఇచ్చిందనే చెప్పాలి. అటు తేజ సజ్జాకు బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాగా కూడా మిరాయ్ నిలిచింది. ఇక మంచు మనోజ్ కు కెరీర్ బెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది మిరాయ్.