Minister Kandula Durgesh: పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ సమయంలోనే బంద్ ఎందుకు..?
- జూన్ 1 నుండి థియేటర్లు మూసివేయాలని ఎగ్జిబిటర్ల నిర్ణయం..
- విచారణకు ఆదేశించిన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్..
- సినిమా రంగానికి సంబంధించిన ఏ సమస్యనైనా పరిష్కరించడానికి సిద్ధం..
- ప్రభుత్వంతో చర్చించకుండానే థియేటర్ల బంద్ పై ఎగ్జిబిటర్ల నిర్ణయం సరికాదు..
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమాకే ఇలాంటి ఇబ్బందులు ఎందుకు..
- హరహర వీరమల్లు రిలీజ్ సమయంలోనే ఇలాంటి నిర్ణయాలు ఏమిటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kandula Durgesh: జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంపై విచారణ చేపట్టాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రికందుల దుర్గేష్ ఆదేశించిన విషయం విదితమే.. అసలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ సమయంలోనే ఇలాంటి నిర్ణయం ఎందుకు అని ప్రశ్నించారు మంత్రి.. హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్లు మూసి వేయాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారో తెలుసుకోవడం కోసమే విచారణ అన్నారు.. ఈ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శికి దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేయకుండా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో తెలుసుకోవడం కోసమేనని అని.. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అన్ని రకాల సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్..
Read Also: Monsoon: మరి కొద్దిసేపట్లో కేరళకు రుతుపవనాలు.. 16 ఏళ్లలో..!
Also Read
- Fauzi Shooting Update: 'ఫౌజీ' కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
- Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
- RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
రాజమండ్రిలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్… సినిమా రంగానికి సంబంధించిన ఏ సమస్యనైనా సానుకూలంగా పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించకుండా జూన్ 1 నుండి థియేటర్లు మూసివేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం సరైంది కాదని హితవుచెప్పారు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమా హరహర వీరమల్లు రిలీజ్ సమయంలోనే ఇలాంటి ఇబ్బందులు ఎందుకు.? అని ప్రశ్నించారు. దీనిపై చర్చించడానికి పూర్తి ఎంక్వయిరీ జరుగుతుంది… సినిమా ఇండస్ట్రీ బాగుండాలన్నా… వీరి తీసుకున్న నిర్ణయం గురించి తెలియాలి.. సినిమా రంగానికి సంబంధించి ఒక కొత్త పాలసీను కూడా తీసుకురాబోతున్నాం అని వెల్లడించారు.. సినీ పరిశ్రమనికి ప్రభుత్వం తరఫునుంచి పూర్తి సహకారం ఉంది… పర్సంటేజ్ పెంచాలని ఎగ్జిక్యూటర్స్ అడుగుతున్నారనేది తెలిసిందన్నారు.
Read Also: Vijayawada: విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. ఒకరిని కాపాడబోయి ఒకరు..!
ఏపీ, తెలంగాణలో థియేటర్స్ అన్ని లీజుకు తీసుకొని నడుపుతున్నారు… హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు ఈ వాతావరణం ఎందుకు వచ్చిందని చాలామంది అడుగుతున్నారని తెలిపారు మంత్రి కందుల దుర్గేష్.. ఎగ్జిబిటర్ బంద్ కు మేము సుముఖంగా లేము అని చెప్తున్నారు… దీంట్లో ఎవరి ప్రమాయమైన ఉందా.. ? లేదా ఇలాంటి వాతావరణాన్ని ఎవరైనా క్రియేట్ చేస్తున్నారని అనుమానం కలుగుతుందన్నారు.. దీనిపై ఎంక్వయిరీ చేసి హోమ్ సెక్రెటరీకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం.. ఎంక్వయిరీ మొదలైంది. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్.. సంపూర్ణంగా వారికీ ఉపయోగపడే వాతావరణాన్ని ఇవ్వడానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సముఖంగా ఉన్నారు.. సినిమా రేట్ల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఎన్టీవీకి వెల్లడించారు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!