సంగీతం అంటే ఉత్సాహం, డ్యాన్స్ అంటే ఎనర్జీ, స్టేజ్ అంటే మ్యాజిక్.. ఈ మూడు మాటలు ఒకే వ్యక్తికి సరిపోతాయి.. అదే మైఖేల్ జాక్సన్. అమెరికాలోని గ్యారీ, ఇండియానాలో ఆగస్ట్ 29, 1958న జన్మించిన ఆయన చిన్న వయస్సులోనే “జాక్సన్ 5” బ్యాండ్‌లో భాగమయ్యారు. ఆ తర్వాత సొంతంగా చేసిన ప్రయాణమే ఆయనను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. “Thriller”, “Billie Jean”, “Beat It”, “Smooth Criminal” వంటి పాటలతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించారు.
కానీ ఆయన జీవితం అంత సాఫీగా ఏం సాగలేదు.. వివాదాలు, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత ఒత్తిడులు ఈ అన్ని తుఫానుల మధ్య కూడా ఆయన సంగీతాన్ని ఆపలేదు. అప్పుడు ఎలాంటి సోషల్ మీడియా లేకున్నా ప్రపంచాన్ని తన మ్యూజిక్, డ్యాన్స్, స్టైల్‌తో ఊపేసిన మైఖేల్ జాక్సన్ 2009లో ఆకస్మికంగా మరణించారు. అయినప్పటికి ఆయన పాటలు, ఆయన స్టైల్ ఇంకా కోట్లాది హృదయాల్లో బతుకుతున్నాయి. అయితే ఆయన జీవితం, కెరీర్ మాత్రమే కాదు – మరణం కూడా మిస్టరీగానే మిగిలిపోయింది.
Also Read : Ram Pothineni : ఈసారి మాస్ కాదు, క్లాస్ ఫీలింగ్‌తో సినిమా చేశా..
ఆయనపై ఎన్నో కోణాలు, అనుమానాలు, కథనాలు వచ్చినా… ఏది నిజమో ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో, మైఖేల్ జీవితం, ఆయన సంగీత ప్రయాణం, వెనుక జరిగిన నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ “మైఖేల్” ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. మైఖేల్ జాక్సన్ పాత్రలో ఆయన సొంత మేనల్లుడు జాఫర్ జాక్సన్ నటించగా, ప్రముఖ దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా (Training Day, The Equalizer) ఫేమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా విడుదలైన టీజర్ కు మంచి స్పందన వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు మైఖేల్ జ్ఞాపకాలలో తేలిపోతున్నారు. మేకర్స్ తాజాగా ఈ సినిమాను 2026 ఏప్రిల్ 24న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అయితే సినిమా డబ్బింగ్ వెర్షన్‌ల గురించి (ఇతర భాషల్లో రిలీజ్ పై) ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.
MICHAEL – in theaters April 24, 2026 #MichaelMovie pic.twitter.com/CzmEuwTcFi
— Michael Jackson (@michaeljackson) November 6, 2025