మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన హారర్ థ్రిల్లర్ ‘‘భ్రమ యుగం’’ ఆడియన్స్ నే కాదు, విమర్శకులను సైతం ఆకట్టుకుంది. ఆ తర్వాత ప్రతి సినిమ కంటెంట్ బాగానే ఉన్నా, ఎగ్జిక్యూషన్‌లో మిస్ ఫైర్ అవ్వడం వల్ల. ఆడియన్స్‌కి కొత్తగా అనిపించినా సినిమాతో కనెక్ట్ కావాల్సిన భావోద్వేగం మిస్సయ్యింది. అదే మమ్ముట్టిని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టించింది. మెగాస్టార్‌గానే కాదు, రిస్క్ టేకర్‌గా కూడా పేరున్న మమ్ముట్టి. వరుస ప్రయోగాలు ఇప్పుడు కామన్ ఆడియన్స్‌నే కాదు, ఫ్యాన్స్ ను కూడా కన్ ఫ్యూజ్ చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం మమ్ముట్టి నుంచి వస్తోన్న సినిమా కలంకావల్. జితిన్ కె జోస్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఓ మర్డర్ కేసులో నిజాన్ని నిర్ధారించడం కోసం ఎలాంటి పోరాటం చేశాడన్న సస్పెన్స్ థ్రిల్లర్ తో తెరకెక్కగా నవంబర్ లో థియేటర్ లోకి వస్తుందన్నారు. కాని, ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇప్పుడు డిసెంబర్ 5కు పోస్ట్ పోన్ అయింది.
Also Read : Nikhil Siddhartha : స్వయంభు సరే.. ఆ రెండు సినిమాల సంగతేంటి
వరుస ప్లాపుల్లో ఉన్న ముమ్మట్టి మళ్లీ సూపర్ హిట్ ఫామ్‌లోకి వచ్చి డబుల్ ఇంపాక్ట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. దేశ భక్తి, సామాజిక అంశాలతో వస్తోన్న పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘‘పేట్రియట్’’ మల్టీ లాంగ్వేజెస్ లో, పాన్ ఇండియా రేంజ్ లో, విషు ఫెస్టివల్ స్పెషల్ గా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, మమ్ముట్టి, మోహన్ లాల్, నయనతార, ఫాహద్ ఫాజిల్ లాంటి స్టార్ క్యాస్టింగ్ సినిమా పైన భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ రెండు సినిమాల్లో స్ట్రాంగ్ కంటెంట్ , స్టార్డమ్ , మాసివ్ ఇంటెన్సిటీ కలుస్తున్నాయి.దాంతో ఈ రెండు సినిమాలు మమ్ముట్టి కెరీర్ లో సూపర్ హిట్ సినిమాలు అవుతాయని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.