జోవియల్ క్యారెక్టర్స్ నుండి నిఖిల్ సిద్ధార్థ్‌ను టోటల్‌గా ఛేంజ్ చేసింది కార్తీకేయ. ఈ సినిమా హిట్టుతో స్క్రిప్ట్ సెలక్షన్స్ సీరియస్‌గా తీసుకున్నాడు యంగ్ హీరో. సెలక్టివ్ కథలను ఎంచుకుని సక్సెస్ చూశాడు. ఇక కార్తీకేయ2తో పాన్ ఇండియా ఐడెంటిటీని తెచ్చుకున్న నిఖిల్.. ఆ తర్వాత కొన్ని మిస్టేక్స్ చేయడంతో గ్రాఫ్ కాస్త డౌన్ అయ్యింది. స్వయంభు కోసం టోటల్ లుక్స్ అండ్ గెటప్ ఛేంజ్ చేశాడు. రెండేళ్ల పాటు ఈ సినిమా కోసం బాగానే కష్టపడ్డాడు. ఈ మాగ్నమ్ ఓపస్ మూవీని నెక్ట్స్ ఇయర్ ఫిబ్రవరి13న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు మేకర్స్. స్వయంభును రూ. 100 కోట్లతో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
Also Read : RT 77 : రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్
దర్శకుడు భరత్ డెబ్యూడెంట్ కానీ రవిబస్రూర్, సెంథిల్ కుమార్, కింగ్ సోలోమన్ లాంటి స్టార్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్స్. ఈ పీరియాడిక్ వార్ జోన్‌తో మళ్లీ ట్రాక్ ఎక్కాలని ట్రై చేస్తున్నాడు నిఖిల్. స్వయంభు అప్డేట్ ఇచ్చేసిన నిఖిల్ చేతిలో.. మరో పీరియాడిక్ డ్రామా ది ఇండియా హౌస్ ఉంది. లవ్ అండ్ రెవల్యూషన్ బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకుంటోంది. ఇందులో నిఖిల్ సరసన సాయి మంజ్రేకర్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ వెంచర్‌లో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు రామ్ చరణ్. ఇది రెండేళ్ల క్రితం స్టార్ట్ అయి ఇప్పటికి షూటింగ్ చేసుకుంటూనే ఉంది. కానీ ఎలాంటి అప్డేట్ లేదు. ఆ మధ్య సెట్‌లో ప్రమాదం జరిగినప్పుడు అర్థమైంది సినిమా లైన్లోనే ఉందని. అసలు ఈ సినిమా ఎంతవరకు వచ్చింది ఏంటి పరిస్థితి అని ఎలాంటి సమాచారం లేదు. అలాగే కార్తీకేయ3 ఉంటుందని గతంలో హింట్ ఇచ్చాడు నిఖిల్. మరి ఆ సీక్వెల్ ను ఎప్పుడు సెట్స్ పైకి తీసుకువెళ్తాడో.