నేడు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి రక్తదానం చేశారు. రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడే గొప్ప అవకాశం మనకు ఉందని ఆయన చెప్పారు. రక్తదానం చేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు. రక్తదానం చేస్తున్న పిక్స్‌ని ట్విట్టర్ లో పోస్ట్ చేసి, అన్ని దానాల్లో కన్న రక్తదానం గొప్పదంటూ ట్వీట్ చేశారు. కాగా, చిరు బ్లడ్ బ్యాంకు ద్వారా రక్తదానాన్ని ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా పరిస్థితుల్లో చిరు ఆక్సిజన్ బ్యాంకులను తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో నెలకొల్పాడు. ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ చేయనున్నాడు.