Mega158: 2027 సంక్రాంతి బరిలో మెగాస్టార్

Mega 158 Kaka

Mega 158 Kaka

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం #Mega158 నుంచి సినీ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని సంక్రాంతి 2027 కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అనుకున్న ప్లాన్ ప్రకారం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే దాదాపు 40 రోజుల చిత్రీకరణ విజయవంతంగా పూర్తయింది. సినిమాకు సంబంధించి ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ దాదాపు పూర్తయి లాక్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ విజువల్ స్పెక్టాకిల్‌ను నిర్మిస్తోంది.

మెగాస్టార్ పుట్టినరోజైన ఆగస్ట్ 22న సినిమా నుంచి అదిరిపోయే అఫీషియల్ అప్‌డేట్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. మన శంకర వరప్రసాద్ గారు లాంటి బ్లాక్ బస్టర్, వాల్తేరు వీరయ్య లాంటి కాంబో కావడంతో ఈ సినిమా మీద కూడా ముందు నుంచి అందరి ఫోకస్ ఉంది. ఇప్పటికే సంక్రాంతికి అనిల్ రావిపూడి వెంకటేష్ కళ్యాణ్ రామ్ సినిమా. రవితేజ – శ్రీవిష్ణు ఎంటర్‌టైనర్, శర్వానంద్ – శ్రీనువైట్ల కాంబో చిత్రం, ప్రశాంత్ వర్మ ‘మహాకాళి’, సాయి దుర్గా తేజ్ ‘SYG (సంబరాల ఏటిగట్టు) సినిమాలు ఉండగా ఇప్పుడు మెగాస్టార్ సినిమా కూడా అదే సీజన్ మీద కన్నేయడంతో ఏం జరగనుంది అనేది చూడాలి.