Sigma Release Date: సందీప్ కిషన్ ‘సిగ్మా’ రిలీజ్ డేట్ అనౌన్స్ .. విజయ్ తనయుడి డైరెక్షన్ మూవీ ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sigma Release Date: యువ హీరో సందీప్ కిషన్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘సిగ్మా’ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండటానికి ప్రధాన కారణం తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా అరంగేట్రం చేయడమే. యాక్షన్, అడ్వెంచర్, హీస్ట్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ మూవీ తొలుత 2026 జూలై 31న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ విడుదల వాయిదా పడింది. అయితే ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. లైకా ప్రొడక్షన్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ‘సిగ్మా’ ఇప్పుడు 2026 అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం ప్రత్యేక పోస్టర్‌తో అధికారికంగా ప్రకటించింది. గాంధీ జయంతిని లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు మేకర్స్.
‘సిగ్మా’ కథ కూడా యాక్షన్ సినిమాలకు భిన్నంగా ఉండబోతోందని సమాచారం. ఈ కథలో హై వోల్టేజ్ బ్యాంక్ హీస్ట్, అడ్వెంచర్ ఎలిమెంట్స్ హైలెట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ జానర్లో సందీప్ కిషన్ కనిపించడం కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇందులో సందీప్ కిషన్ సరసన ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. వీరితో పాటు సంపత్ రాజ్, శివ్ పండిట్, రాజు సుందరం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా నిర్మాణంలో కూడా ఎలాంటి రాజీ పడకుండా చిత్రబృందం ముందుకెళ్తోంది. ప్రస్తుతం చెన్నై, తలకోన అడవులు, సేలం, థాయ్‌లాండ్‌లోని పలు అందమైన లొకేషన్లలో షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. అడవులు, విదేశీ లొకేషన్లు, యాక్షన్ బ్లాక్స్ కలిసి సినిమాకు గ్రాండ్ విజువల్ అనుభూతిని అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న థమన్ ఇప్పటికే సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇటీవల విడుదలైన ‘ఓలమ్మో వగలాడి’ మాస్ బీట్ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. పాటకు వచ్చిన స్పందనతో సినిమా ప్రమోషన్స్‌కు మంచి ఊపు వచ్చింది. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు హైలెట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.
Also Read
- Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
- Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
- The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
- Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి 'హనుమాన్ అంశ్' - సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
జేసన్ సంజయ్‌కు దర్శకుడిగా ఇది ఫస్ట్ మూవీ కావడంతో సినీ పరిశ్రమ మొత్తం ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. లైకా ప్రొడక్షన్స్ వంటి భారీ నిర్మాణ సంస్థ, సందీప్ కిషన్ యాక్షన్ ఇమేజ్, థమన్ సంగీతం కలిసి ‘సిగ్మా’ను 2026లో బెస్ట్ సినిమాలలో ఒకదానిగా నిలిపినా ఆశ్చర్యపోనక్కర్లేదనిపిస్తోంది. మరి అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘సిగ్మా’ సందీప్ కిషన్‌కు మరో పెద్ద హిట్‌ను అందిస్తుందా, జేసన్ సంజయ్ దర్శకుడిగా తొలి ప్రయత్నంతోనే ముద్ర వేస్తారా అన్నది తెలియాలంటే రిలీజ్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.
- Tags
- cinema
- sandeep kishan
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 12 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..!
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?