Chiranjeevi: వీరిని సక్రమమైన మార్గంలో పెడితే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి తాజాగా చిరంజీవి టారిటబుల్ ట్రస్ట్‌కు విచ్చేశారు. శనివారం నాడు ఆయన మెగా రక్త దాతలను సత్కరించారు. వారితో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఛారిటబుల్ ట్రస్ట్ విశిష్టతలు, రక్త దాతల గొప్పదనాన్ని వివరించారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘నా చిన్ననాటి మిత్రుడు శంకర్ బ్లడ్ బ్యాంక్‌కి సీఈవోగా ఉన్నారు. మరో మిత్రడు సీజేఎస్ నాయుడు సీఎఫ్‌వోగా సేవలు అందిస్తున్నారు. స్వామి నాయుడు అలుపెరగని సైనికుడిలా, జీవితాన్ని అంకితం చేస్తూ కొనసాగుతున్నారు. ఆయనే నా బలం. వీళ్లంతా నా వెన్నుదన్నులా ఉండటం వల్లే ఇలాంటి కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాను. మేము సైతం అన్నట్టుగా నా అభిమానులు, సోదరసోదరీమణులు రక్త దానానికి ముందుకు వస్తున్నారు. రేపు మనం ఎక్కడున్నా సరే ఈ సేవా కార్యక్రమం మాత్రం ముందుకు సాగుతూనే ఉంటుంది. రక్తం పంచిన, రక్తం ఇచ్చిన నా సోదరసోదరీమణుల సహకారంతో ఈ కార్యక్రమం నిరంతరంగా సాగుతూనే ఉంటుంది.
ప్రతిఫలాన్ని ఆశించి ఏ పనిని కూడా మనం ప్రారంభించకూడదు. దీని పర్యవసానాలు ఏంటి? ఇలా చేస్తే ఏం వస్తుంది? అని ఆలోచించకుండా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను. రక్తం ఇవ్వడానికి ఒకప్పుడు చాలా భయపడేవాళ్లు. కొంత మంది డబ్బు ఆశ చూపించి రక్తం తీసుకునేవారు. ఇప్పటిలా స్వతాహాగా ముందుకు వచ్చి రక్తం ఇవ్వడం అనేది అప్పట్లో లేదు. సరైన టైంకి రక్తం అందక ప్రాణాలు పోతోన్నాయని తెలిసి బాధ పడేవాడ్ని. డెలివరీ టైంలో అధిక రక్తస్రావం జరగడం, తలసేమియా, లుకేమియా, ప్లేట్ లేట్స్ లేక చాలా మంది చనిపోతోన్నారని తెలుసుకున్నాను. నాకు ఇంత మంది అభిమానులు ఉన్నారు కదా.. వీరంతా యువకులు.. వీరిని సక్రమమైన మార్గంలో పెడితే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు కదా అని అనుకున్నాను. అలాంటి టైంలోనే స్వామి నాయుడుని ఈ కార్యక్రమానికి అంకితం కావాలని కోరాను. రక్తం ఇవ్వమని అభిమానుల్ని కోరితే వారు ఇస్తారా? అని మొదట్లో సందేహపడ్డాను. నాతో ఫోటో దిగాలని, నన్ను కావాలని కోరుకునే వారంతా ముందు రక్తం ఇవ్వండి అని కండీషన్ పెట్టాను. ఆ టైంలో ఉత్సాహవంతమైన కుర్రవాళ్లంతా రక్తం ఇచ్చారు. నాతో ఫోటో దిగారు. ఇది నిరంతరం సాగుతుందా? ఇచ్చిన వాళ్లు మళ్లీ ఇస్తారా? ఆసక్తి చూపిస్తారా? అని అనుకున్నాను. కానీ ఇప్పుడు మీలో కొన్ని పదులు, వందల సార్లు రక్తం ఇచ్చిన వారున్నారు. సేవా కార్యక్రమంలో ఉన్న ఆ మాధుర్యాన్ని మీరంతా అనుభవిస్తున్నారు కాబట్టే ఇన్ని సార్లు రక్తాన్ని ఇచ్చారనిపిస్తుంటుంది. నా తరువాత చరణ్ కూడా ఈ సేవా కార్యక్రమాల్ని కొనసాగించాలని అనుకుంటున్నాడు. మంచి చేస్తే తిరిగి మంచే జరుగుతుందని భావిస్తుంటాను.
Also Read
- Teachers Day Special: టీచర్ అంటే జీవితాన్ని మార్చేవాడు! తెలుగు తెరపై గురువును గుర్తుచేసే మూడు గొప్ప సినిమాలు
- Crime Thriller OTT: ఊపిరి సలపనివ్వని గంటా 56 నిమిషాల క్రైమ్ థ్రిల్లర్.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్
- Varanasi: మహేశ్ బాబు ‘వారణాసి’లో అదిరిపోయే బుల్ ఫైట్.. హైదరాబాద్ శివార్లలో షూటింగ్!
- Irumudi success: పాన్ ఇండియా మోజుకు ‘ఇరుముడి’ నేర్పిన పాఠం ఇదేనా ?
ఓ సారి నేను అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు వెళ్తే.. అక్కడి నాయకులు ఒకరు నా మీద అవాకులు చవాకులు పేలారు. అలాంటి మాటలన్నీ నేను పట్టించుకునే వాడ్ని కాదు. కానీ నన్ను అభిమానించే వాళ్లు అలా ఉండరు కదా. ఓ సారి ఆ నాయుకుడిని ఓ మహిళ చెడమడా తిట్టేశారు. ఎందుకు ఇలా తిట్టింది? అసలు ఆమె ఎవరు అనే విషయాన్ని కనుక్కోమని చెప్పాను. ఆమె నా అభిమాని కాదని అప్పుడు తెలిసింది. మరి ఎందుకు ఆయన కోసం ఆ నాయకుడిని తిట్టావు అని అంటే.. చిరంజీవి గారి వల్లే నా బిడ్డ ప్రాణాలు నిలబడ్డాయి. డెంగ్యూ వచ్చినప్పుడు రక్తం దొరక్క కష్టాలు పడుతుంటే.. వారి వల్లే నా బిడ్డ బతికాడు. ఆయన నాకు దేవుడితో సమానం.. అలాంటి వ్యక్తిని పట్టుకుని ఇష్టమొచ్చినట్టు తిడితే కోపం రాదా? అని ఆ మహిళ అన్నారు. మనం చేసిన పుణ్యం ఎక్కడికీ పోదని నాకు అప్పుడు అర్థమైంది. అందుకే పెద్దలు ధర్మో రక్షితి రక్షిత: అంటారు. మన ధర్మం మనం పాటిస్తే, మంచి పనులు చేస్తే అవే తిరిగి వస్తాయి. అందుకే మంచి పనులు చేయండి, పాజిటివ్‌గా ఆలోచించండని అందరికీ చెబుతుంటాను. నన్ను ఎంత మంది తిట్టినా, అకారణంగా ఏమైనా అన్నా కూడా నేను పట్టించుకోను. మనసుకుని తీసుకోను. ప్రశాంతంగా ఉంటాను. మీ అందరి సహకారం వల్లే నేను ఇంత చేయగలుగుతున్నాను. రక్తదాతలే దేవుళ్లు. నేను సంధాన కర్తను మాత్రమే. ఈ పుణ్యమంతా కూడా మీదే.
డబ్బుని ఆశించకుండా, ఫ్రీ సర్వీస్ చేసేందుకు శంకర్, నాయుడు, స్వామి నాయుడు వంటి వారు ముందుకు వచ్చారు. వీళ్లందరికీ నా కృతజ్ఞతలు. APTA ఈవెంట్‌కు వెళ్లినప్పుడు నేనేం మాట్లాడాలని అనుకున్నాను. నేనేమీ వ్యాపారవేత్తను కాదు.. ఏం మాట్లాడాలా? అని ఆలోచించాను. అందుకే నా గురించి చెప్పాను.. నేను నా సినీ ప్రయాణాన్ని ఎలా ప్రారంభించాను.. ఈ స్థాయికి ఎలా వచ్చానో చెప్పాను. సాదాసీదా కుటుంబం నుంచి వచ్చినా, టాలెంట్ మీద నమ్మకం, బలీయమైన సంకల్పం, అందరి కంటే ప్రత్యేకత ఉండేలా చూసుకున్నాను. డ్యాన్సులు, ఫైట్లలో నా ముద్ర వేశాను. రిపీటెడ్‌గా పాటలు, ఫైట్లు వేయించుకుని చూసేవారు. అదే నా ప్రత్యేకత. దాని వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. ఇతనితో చేస్తే డబ్బులు వస్తాయి.. ఇతని కోసం రిపీటెడ్‌గా ఆడియెన్స్ వస్తున్నారు.. ఇతనితో చేస్తానంటే డబ్బులు పెడతామని డిస్ట్రిబ్యూటర్లు చెప్పేవారు. అలా నన్ను ముందుగా ఆడియెన్స్ ఆదరించారు. ఆ తరువాత కళామతల్లి నన్ను అక్కున చేర్చుకుంది. అందుకే నేను ఆడియెన్స్‌కి ఎల్లప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను. ఆడియెన్స్, అభిమానుల సంకల్పం వల్లే ఈ బ్లడ్ బ్యాంక్ నిరంతరంగా సాగుతూ ఉంది. ఇలా రక్తదాతల్ని కుదిరినప్పుడల్లా కలుస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అనేది మీ ఇళ్లు లాంటిది.. మీకు నచ్చినప్పుడు వచ్చి రక్తాన్ని దానం చేయొచ్చు. లవ్ యూ ఆల్’ అని అన్నారు.
తాజావార్తలు
-
Dengue Insurance Claim: ‘డెంగ్యూ సీరియస్ కాదట’.. ప్లేట్లెట్స్ 70 వేల కంటే తగ్గలేదంటూ మెడిక్లెయిమ్ రిజెక్ట్?
-
Explainer: ఆ నగరాలు మునిగిపోతున్నాయి..! UN నివేదికలో షాకింగ్ నిజాలు!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ వల్లే నా భార్య దులీప్ ట్రోఫీ చూసింది’.. శ్రీకాంత్ కామెంట్స్ వైరల్
-
Ratan Tata: ఆ రూ.10,000 కోట్ల సంపద.. ఎవరికి దక్కనుంది? రతన్ టాటా ఆస్తి వెనుక ఊహించని ట్విస్ట్!
-
Teachers Day 2026: ఉపాధ్యాయులతో ప్రధాని మోడీ సంభాషణ.. టీచర్స్ డే సందర్భంగా కీలక సందేశం
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!