కొణిదెల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా డిఫ్రెంట్ కథలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. గతేడాది మట్కా తో నిరాశపరిచిన వరుణ్ ఈ సారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలని యంగ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీతో డైరెక్షన్లో ఓ హారర్-కామెడీ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Also Read : NANI : హిట్ 3 ఓవర్సీస్ సూపర్బ్ స్టార్ట్
ఈ సినిమా ఓ వైపు షూటింగ్ జరుగుతుండగానే మరోవైపు ఇతర దర్శకుల కథలు కూడా వింటున్నాడు వరుణ్. ఈ దశలో ఓ డిజాస్టర్ దర్శకుడు చెప్పిన కథ వరుణ్ నచ్చినట్టు తెలుస్తోంది. గోపిచంద్ తో జిల్ అలాగే రెబల్ స్టార్ తో రాధేశ్యామ్ ను డైరెక్ట్ చేసిన రాధాకృష్ణ ఇటీవల వరుణ్ తేజ్ ను కలిసి ఓ కథ వినిపించాడట. జస్ట్ లైన్ మాత్రమే చెప్పాడని ఫుల్ నరేషన్ ఇంకా జరగలేదని తెలుస్తోంది. వాస్తవానికి వరుణ్ తేజ్ కంటే ముందుగా గోపీచంద్ తో సినిమా చేసేందుకు రాధాకృష్ణ కథ వినిపించాడు. అంతా ఒకే అయింది. అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వస్తుంది అనుకున్న టైమ్ లో ఘాజి దర్శకుడు సంకల్ప్ రెడ్డితో సినిమా ప్రకటించాడు గోపీచంద్. ఇక రీసెంట్ గా మరో యంగ్ డైరెక్టర్ సినిమాను స్టార్ట్ చేసాడు. ఇక రాధాకృష్ణ సినిమా లేనట్టే అనుకోవాలి. ఆ కథ ఇప్పుడు వరుణ్ తేజ్ వద్దకు చేరినట్టు టాక్. రాధాకృష్ణ తో సినిమా చేసేందుకు వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా మరో కొద్దీ రోజుల్లో క్లారిటీ రావొచ్చు.