AATT: జనవరి 31న తెలుగు టీవీ ఆర్టిస్టుల సంఘం ఎన్నికలు.. జీఎస్ హరి ప్యానెల్ మేనిఫెస్టో ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు టెలివిజన్ ఆర్టిస్టు అసోషియేషన్ (Artists Association of Telugu Television (AATT) కార్యవర్గం ఎన్నికలు ఈ నెల 31న జరగబోతున్నాయి. ఈ సందర్భంగా ఫిలించాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమవేశంలో జీఎస్ హరి ప్యానెల్ సభ్యులు మేనిఫెస్టో విడుదల చేశారు. తమ జీఎస్ హరి ప్యానెల్ గెలిస్తే.. తెలుగు టెలివిజన్ ఆర్టిస్టులకు పలు ప్రయోజనాలు అమలు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
Parasakthi: ఒకే టైటిల్ తో ఒకే రోజు సినిమాలు అనౌన్స్ చేసిన స్టార్ హీరోలు
Also Read
జీఎస్ హరి ప్యానెల్ మేనిఫెస్టో :
1. ఒక్కో తెలుగు సీరియల్లో ఒక్క పర భాష ఆర్టిస్ట్ కి మాత్రమే అనుమతి ఇప్పించే ప్రయత్నం
2. వీక్లీ షూటింగ్ డేట్స్ బ్లాకింగ్ పద్దతిని నిర్మాతలు, ఛానల్స్‌తో మాట్లాడి రద్దు చేయించే ప్రయత్నం
3.అర్హులైన పేద కళాకారులకు పెన్షన్లు అందించే ప్రయత్నం
4. మెడిక్లైమ్ పాలసీ 3 లక్షల నుండి 5 లక్షలకు పెంపు ప్రయత్నం
5. నాగబాబు గారి సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో టీవీ నగర్ కృషి
6. 3. స్త్రీ సభ్యులకు ప్రత్యేక రక్షణ కల్పిస్తాం.
7. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ అవార్డులు మన తెలుగు టీవీ కళాకారులకు అమలు
8. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ద్వారా మన సభ్యులై ఉండి అక్కడ నివాసం ఉంటున్న వారికి తెల్ల రేషన్ కార్డుల కోసం ప్రయత్నం
9. టాలెంట్ సెర్చ్ నిర్వహించి ఛానల్స్ వారికి, కొత్త తెలుగు కళాకారులకు మధ్య వారధిలా వ్యవహరిస్తాం.
10. ఈఎస్ఐ స్కీం వర్తింప చేస్తాము
11 ప్రావిడెంట్ ఫండ్ స్కీం అమలు చేస్తాం
12. ప్రతి మెంబర్‌కి వర్క్ కల్పిస్తాం
ఈ సందర్భంగా సీనియర్ టీవీ నటుడు విజయ్ యాదవ్ మాట్లాడుతూ.. టెలివిజన్ కళాకారుల సంక్షేమమే ధ్యేయంగా వినోద్ బాల ఆధ్వర్యంలో 27 ఏళ్ల క్రితం మా తెలుగు టెలిజవిన్ ఆర్టిస్టు అసోషియేషన్ అసోసియేషన్‌ను ప్రారంభించాము. ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమలు చేశామని ఘనంగా చెప్పగలుగుతున్నాం. మా అసోసియేషన్‌కు మాత్రమే సొంత బిల్డింగ్ ఉంది. వందలాది మంది ఆర్టిస్టుల సమస్యలు పరిష్కరించాం. మెడిక్లెయిమ్ చేయించాము. తెలుగు ఆర్టిస్టులకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలనేదే మా ప్రయత్నం. సీరియల్ షూటింగ్ టైమింగ్ విషయాలపై మేము ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నాం. కరోనా సమయంలో చిరంజీవి గారి ట్రస్ట్, అప్పటి మంత్రి శ్రీనివాస్ యాదవ్‌ల సహకారంతో ఆర్టిస్టులందరికి సహాయం చేశాం. పేద కళాకారులకు పెన్షన్ ఇచ్చాము. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. సమర్థులైన జీఎస్ హరి ప్యానెల్ సభ్యులను భారీ మెజారిటీతో గెలిపించుకుంటే టెలివిజన్ కళాకారుల సమస్యలు తీర్చుతూ, సంక్షేమంపై దృష్టిపెడతామని అన్నారు.
తాజావార్తలు
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..