మెగా, అల్లు కాంపౌండ్స్ మధ్య దూరం పెరుగుతోంది అనే ప్రచారం ఇప్పటిది కాదు. కొన్నాళ్ల క్రితం అల్లు అర్జున్ ఈవెంట్‌లో “జై పవర్ స్టార్” అని అనాల్సిందిగా కోరడంతో అల్లు అర్జున్ ఇరిటేట్ అయి, “నేను చెప్పను బ్రదర్” అని అనడంతో కొంత ఈ వివాదానికి కారణమైందని చెప్పొచ్చు. ఆ తర్వాత అల్లు అర్జున్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు, చేసిన కొన్ని పనులు మెగా ఫాన్స్‌కి కోపం తెప్పించాయి. దీంతో మెగా అభిమానులు, అల్లు అభిమానులు అంటూ విడిపోయి సోషల్ మీడియాలో వార్స్ చేసుకుంటున్న పరిస్థితి. కానీ నిన్న అల్లు రామలింగయ్య భార్య అల్లు కనక రత్నం మరణంతో అల్లు కుటుంబాన్ని మెగా ఫ్యామిలీ అంతా పరామర్శించారు.
Also Read:Bigg Boss 9 : రెడీ అయిన బిగ్ బాస్ 9 హౌస్.. కానీ ఈ ట్విస్ట్ ఏంటి సామి..!
మెగాస్టార్ చిరంజీవి అయితే అల్లు అరవింద్ కన్నా ముందే నివాసానికి వెళ్లి అన్ని బాధ్యతలు తానే నిర్వహించారు. నిన్న పొలిటికల్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, నిన్న రాత్రి అల్లు నివాసానికి వెళ్లారు. అల్లు అరవింద్‌తో పాటు అల్లు అర్జున్‌తో కలిసి కాసేపు వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా వారు కలిసిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “ఇది కదా అసలైన ఫ్రేమ్ అంటే!” అంటూ అభిమానులు కామెంట్స్ చేసుకుంటున్నారు. మరోపక్క, వీరంతా బానే ఉంటారు, వీరి అభిమానులుగా చెప్పుకుంటూ చాలామంది గొడవలు పడుతున్నారు, అది కరెక్ట్ కాదని మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా, చిన్న చిన్న మనస్పర్థలు అన్ని కుటుంబాల్లో ఉంటాయి. కానీ దుఃఖంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కుటుంబాలు ఏకమవుతాయి అని మరోసారి ప్రూవ్ అయింది.