Masthu Shades Unnai Ra Gets Thumping Response in OTT: మంచి సినిమాకు ఆడియెన్స్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని చాలా సినిమాలు నిరూపించాయి. చిన్న సినిమాలకు, ఇప్పుడు వస్తున్న కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకు భారీ ఓపెనింగ్స్ రాకపోవచ్చు కానీ.. ఆడియెన్స్‌కి కనెక్ట్ అయితే చిన్న చిత్రాలే పెద్ద సక్సెస్‌ను అందుకుంటాయి. ఈ క్రమంలోనే మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా.! అనే సినిమా కూడా ఓటీటీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా, ఎమోషన్స్‌ని మించే టెక్నాలజీ అందుబాటులోకి రాలేదని చెప్పొచ్చు. అలాంటి బలమైన ఎమోషన్స్‌ను ప్రధానంగా చేసుకుని తీసిన ఈ సినిమా అందరూ పోల్చుకో తగిన కథతో, అందరూ రిలేట్ అయ్యేలా ఇంటిల్లిపాది చూడగలిగే సినిమాగా వచ్చి అందరినీ ఆకట్టుకుంది.
Average Student Nani: హీరో డీగ్లామర్‌గా ఉండాలని నేనే చేసేసా.. దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు
అభినవ్ గోమఠం , వైశాలి రాజ్, అలీ రెజా ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ఈ చిత్రానికి తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వం వహించగా ఆరెం రెడ్డి, ప్రశాంత్.వి, భవాని కాసుల సంయుుక్తంగా కాసుల క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ మీద ఈ సినిమాను నిర్మించారు. ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజ్ అయి మంచి చిత్రంగా గుర్తింపు తెచ్చుకుని మార్చ్ 29 నుంచి ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతూ 100 ప్లస్ మిలియన్ రియల్ టైం వ్యుయింగ్ మినిట్స్‌తో దూసుకుపోతుందని టీం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇది ఒకరకంగా రేర్ ఫీట్ అనే చెప్పాలి “నిజాల్” రవి, ఆనంద చక్రపాణి, తరుణ్ భాస్కర్, రవీందర్ రెడ్డి, లావణ్య రెడ్డి, జ్యోతి రెడ్డి, సూర్య, రాకెట్ రాఘవ, శ్వేత అవస్తి, సాయి కృష్ణ, ఫణి చంద్రశేఖర్ తదితరులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటించారు.