మాస్ రాజా రవితేజ అంటేనే ఎంటర్‌టైన్మెంట్ గ్యారంటీ. యాక్షన్, కామెడీ, పంచ్ డైలాగ్స్ అని కలిపి ఆయన సినిమాలు ప్రేక్షకులకు మాస్ ట్రీట్ ఇస్తుంటాయి. అలాంటి రవితేజ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’ ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసింది. భాను బోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్గా రూపుదిద్దుకుంటోంది. కానీ రిలీజ్ డేట్ విషయంలో ఇంత గందరగోళం రావడంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. మొదట ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 27, వినాయక చవితి కానుకగా విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. పండుగ సీజన్ కావడంతో ఫ్యాన్స్‌లో, ట్రేడ్ సర్కిల్స్‌లో కూడా బజ్ పెరిగింది. థియేటర్లలో రవితేజ మాస్ ఎంట్రీ కోసం అభిమానులు రెడీ అయ్యారు. కానీ..
Also Read : Vishwambhara : ‘విశ్వంభర’ రిలీజ్‌పై కొత్త డేట్ వైరల్..!
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండగా, కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా పడుతుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజా సమాచారం ప్రకారం, సినిమా ఔట్‌పుట్ విషయంలో మేకర్స్ ఇంకా ఫుల్ సాటిస్ఫై కాలేదట. క్వాలిటీ పై ఎలాంటి కాంప్రమైజ్ చేయకుండా, పర్ఫెక్ట్ ఫైనల్ ప్రోడక్ట్ రాకుండా రిలీజ్ చేయబోమని టీమ్ భావిస్తోందట. అందుకే వాయిదా అనివార్యం అవుతుందని సినీ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. తర్వాత మళ్లీ “రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు లేదు, యథాతథంగానే వస్తుంది” అంటూ మరో వార్త రావడంతో ఫ్యాన్స్ కన్‌ఫ్యూజ్ అయ్యారు. దీంతో వారు ఎప్పుడు అధికారికంగా స్పష్టత ఇస్తారన్నదే హాట్ టాపిక్‌గా మారింది.